Trivikram: త్రివిక్రమ్ ను బుద్ధి ఉందా లేదా అని ముఖం మీదే అన్నాడట
* నేనే ఇండస్ట్రీలో పార్ట్ టైం రచయితని నేనెలా అసిస్టెంట్ ని పెట్టుకుంటాను అని అడిగాను.
Kommanapalli Ganapathi Rao: స్క్రిప్ట్ రైటర్ గా ఇండస్ట్రీలో కరీర్ మొదలుపెట్టిన త్రివిక్రమ్ శ్రీనివాస్ అతి తక్కువ కాలంలోనే దర్శకుడిగా మారి వరుస బ్లాక్ బస్టర్ లను అందుకుంటూ మాటల మాంత్రికుడిగా పేరు కూడా తెచ్చుకున్నారు. ఎమ్మెస్సీ గోల్డ్ మెడల్ సంపాదించిన త్రివిక్రమ్ ఇండస్ట్రీలోకి డైరెక్టర్గా మారే ముందు ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నారు. కానీ దేనికీ వెన్ను చూపకుండా త్రివిక్రమ్ ఇప్పుడు ఇండస్ట్రీలోని స్టార్ డైరెక్టర్లలో ఒకరిగా మారారు. దాదాపు అందరూ స్టార్ హీరోలతోనూ బ్లాక్ బస్టర్ సినిమాలను తీసిన త్రివిక్రమ్ దాదాపు ప్రతి ఇంటర్వ్యూలోను తన ఎదుగుదలకు కారణమైన వారి గురించి చెబుతూ ఉంటారు. అందులో ఒక వ్యక్తి రచయిత కొమ్మనాపల్లి గణపతి రావు.
ఒక ఇంటర్వ్యూ లో కొమ్మనాపల్లి గణపతి రావు త్రివిక్రమ్ గురించి ఆసక్తికరమైన విషయాలు తెలియజేశారు. "ఇండస్ట్రీలోకి వచ్చే ముందు త్రివిక్రమ్ ముందు నా దగ్గరికి వచ్చాడు. నన్ను అసిస్టెంట్ గా పెట్టుకోమని రిక్వెస్ట్ చేశాడు నేనే ఇండస్ట్రీలో పార్ట్ టైం రచయితని నేనెలా అసిస్టెంట్ ని పెట్టుకుంటాను అని అడిగాను. ఏం చదివావు అని అడిగితే ఎంఎస్సీ ఫిజిక్స్ గోల్డ్ మెడలిస్ట్ అని చెప్పాడు. అప్పుడు నేను బుద్ధుందా నీకు ఇండస్ట్రీ అసలు బాలేదు అవకాశాలు వస్తాయో లేదో తెలీదు, నీ చదువుకు తగ్గట్టు మంచి ఉద్యోగం చేయి అని అన్నాను. కానీ తను మాత్రం ఇండస్ట్రీ లోనే సెటిల్ అవ్వాలని అనుకుంటున్నట్లు చెప్పాడు.
ఏమైనా కథలు రాసావా అని అడిగితే లేదన్నాడు. ఇండస్ట్రీలో ఉండాలంటే కథలు పట్టుకుని తిరగాలి అన్నాను. ఆ తర్వాత రోజు ది రూడ్ అనే ఒక కథను రాసి తీసుకువచ్చాడు. ఆ కథను ఆంధ్ర జ్యోతి ఎడిటర్ కు ఫోన్ చేసి అచ్చు వేయించాను. అది చూసుకొని చాలా మురిసిపోయేవాడు. అప్పుడే నేను మెరుపు అనే సినిమాకు అప్రెంటిస్ గా పెట్టించాను కానీ కొన్ని కారణాలవల్ల నేను ఆ సినిమా నుంచి తప్పుకున్నాను. కానీ త్రివిక్రమ్ మాత్రం నన్ను మర్చిపోకుండా ప్రతి ఇంటర్వ్యూలో గుర్తు చేసుకుంటూ ఉంటాడు," అని అన్నారు కొమ్మనాపల్లి గణపతి రావు.