OTTలో రిలీజ్ కాబోతున్న " ఐ యామ్ మీరా " చిత్రం

I am Meera: ఓటీటీలో మరో తెలుగు సినిమా రిలీజ్ కాబోతుంది.

Update: 2021-04-28 09:35 GMT

 Iam Meera 

I am Meera: శ్రీ శివ భవాని సినిమా ప్రొడక్షన్స్ బ్యానర్ లో జాబిల్లి కోసం ఆకాశమల్లె " చిత్రాన్ని నిర్మించిన గుగ్గిళ్ల శివప్రసాద్ రెండో ప్రయత్నంగా రూపొందిస్తున్న సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ " ఐ యామ్ మీరా " . ప్రిన్స్ , దివ్యంగాన హీరో హీరోయిన్లు గా నటిస్తున్న ఈ చిత్రానికి గోపాల కిషన్ దర్శకత్వం వహించారు . ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటున్న ఈ మూవీ టీజర్ ను విరాట పర్వం చిత్ర దర్శకులు వేణు ఉడుగుల రిలీజ్ చేశారు...

ఈ సందర్బంగా ప్రొడ్యూసర్ గుగ్గిళ్ల శివప్రసాద్ మాట్లాడుతూ : మొదట మా శ్రీ శివ భవాని సినిమా ప్రొడక్షన్స్ బ్యానర్ లో జాబిల్లి కోసం ఆకాశమల్లె " చిత్రాన్ని నిర్మించాము.. రెండో ప్రయతంగా సస్పెన్స్ థ్రిల్లర్ జానర్ లో " Iam Meera " రూపొందిస్తున్నామని అన్నారు... ఈ సినిమా మంచి క్వాలిటీ తో అనుకున్నది అనుకున్నట్లు గా నిర్మించామని తెలిపారు . ఈ సినిమా ఆధ్యంతం ఆసక్తికర కథ కథనాలతో సాగుతుందని మరి ముఖ్యంగా యూత్ ని బాగా ఆకట్టుకుంటుందని తెలిపారు. త్వరలోనే OTTద్వారా రిలీజ్ చేయనున్నట్లు తెలిపారు.

Tags:    

Similar News