Hyper Aadi: ప్రియురాలిని పరిచయం చేసిన హైపర్ ఆది.. స్టేజ్‌పై ప్రపోజ్..
Hyper Aadi: ఛాన్స్ దొరికిందా ఇక అంతే.. పంచ్ డైలాగులతో విరుచుకుపడిపోవడంలో దిట్ట జబర్దస్త్ హైపర్ ఆది.
Hyper Aadi: ఛాన్స్ దొరికిందా ఇక అంతే.. పంచ్ డైలాగులతో విరుచుకుపడిపోవడంలో దిట్ట జబర్దస్త్ హైపర్ ఆది. బుల్లితెర కామెడీ షోల్లో ఆది వేసే పంచులు, సెటైర్లకు చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. ప్రస్తుతం బుల్లితెరపై అతనిదే హవా. పలు టీవీ షోలు చేస్తూ బిజీబిజీగా ఉన్నాడీ ట్యాలెంటెడ్ యాక్టర్. ఇక కేవలం బుల్లితెరపైనే కాకుండా సిల్వర్ స్క్రీన్ పైనా మెరుస్తున్నాడు ఆది. సాఫ్ట్ వేర్ ఉద్యోగాన్ని వదిలేసి తనకున్న ఆ మాటలు విసిరే బలంతోనే జబరదస్త్ షో కి వచ్చి అక్కడ ఆది లేకపోతే ఎలా అనేంతగా పాతుకుపోయాడు.
తాజాగా ఓ టీవీ షోలో తన ప్రియురాలిని పరిచయం చేశాడు హైపర్ ఆది. తాను గత కొంత కాలంగా ఓ అమ్మాయిని ప్రేమిస్తున్నానని, ఆమెను పరిచయం చేస్తానంటూ స్టేజ్‌పైకి పిలిచాడు. ‘ఇప్పటివరకు కంటెంట్ కోసం చాలా మందికి లైన్ వేసినట్లు చెప్పాను. కానీ నేను నిజంగా ప్రేమించింది ఒక అమ్మాయిని మాత్రమే. ఆమె ఇక్కడే ఉందంటూ ‘బేబీ ఒక్కసారి స్టేజ్‌పైకి రా’అని ఆది పిలవగా.. ఒక అమ్మాయితో నవ్వులు చిందిస్తూ స్టేజ్ మీదకు వచ్చింది. ఆ తర్వాత ఆది తనకు ‘ఐ లవ్ యూ విహారిక’ అంటూ ప్రపోజ్ చేశాడు. విహారిక కూడా ‘లవ్ యూ టూ ఆది’ అని చెప్పింది. అంతేకాదు ఇద్దరూ ఒకరి బుగ్గలను ఒకరు ముద్దాడారు. దీంతో షోలో ఉన్నవారంతా చప్పట్లు కొడుతూ ఆ జంటను ఆశీర్వదించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ప్రోమో వైరల్ అవుతుంది.
ఇక ఇది చూసిన కొంతమంది నెటిజెన్స్.. ఇది కూడా స్క్రిప్ట్ లో భాగమే అయ్యి ఉంటుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరికొంత మంది మాత్రం.. ఆమెను ఏ టీవీ షోల్లో చూడలేదు. నిజంగా ఆమె ఆది ప్రియురాలే అయ్యి ఉంటుంది అంటూ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరి ఆమె నిజంగానే ఆది ప్రియురాలా? కాదా? అనేది తెలియాలంటే ఈవారం షో చూసి తెలుసుకోవాల్సిందే.