తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పిన హైపర్ ఆది.. సారీ చెప్పినా వదిలేది లేదన్న..

Hyper Aadi: బుల్లితెర కమెడియన్ హైపర్ ఆది స్కిట్‌లో బతుకమ్మ, గౌరమ్మపై చేసిన కామెడీ వివాదం ఇప్పట్లో ఆగేలా లేదు.

Update: 2021-06-16 04:59 GMT

హైపర్ ఆది(ఫైల్ ఇమేజ్ )

Hyper Aadi: బుల్లితెర కమెడియన్ హైపర్ ఆది స్కిట్‌లో బతుకమ్మ, గౌరమ్మపై చేసిన కామెడీ వివాదం ఇప్పట్లో ఆగేలా లేదు. స్కిట్‌ లో చేసిన దానికి హైపర్ ఆది క్షమాపణలు చెప్పారు. తాము కావాలని ఎవరినీ కించపర్చే ఉద్దేశ్యం తమకు లేదన్నాడు. ఒకవేళ ఎవరి మనోభావాలైనా దెబ్బతిని ఉంటే దానికి నిర్మోహ్మమాటంగా క్షమాపణ కోరుతున్నానని వెల్లడించాడు. అంతేకాదు ఆ రోజు స్కిట్‌లో పాల్గొన్న అందరి తరుపున కూడా క్షమాపణలు కోరుతున్నానన్నారు. ఆంధ్ర, తెలంగాణ అనే బేధాభిప్రాయాలు తమ షోలో లేవని స్పష్టం చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల అందరి అభిమానాలు తమపై ఉన్నాయన్నారు.

దీనిపై స్పందించిన తెలంగాణ జాగృతి స్టూడెంట్ ఫెడరేషన్ హైపర్ ఆదిపై మరోసారి విరుచుకుపడ్డారు. హైపర్ ఆది బాధపెట్టడం, క్షమాపణ చెప్పడం సరైన విధానం కాదన్నారు తెలంగాణ జాగృతి ఫౌండేషన్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు నవీన్ గౌడ్. తను చేసిన తప్పుకు పశ్చాత్తాప పడకుండా కేవలం తప్పించుకునే ధోరణిలో మాట్లాడుతున్నారని మండిపడ్డారు. సరైన సమయంలో సరైన రీతిలో బుద్ధి చెప్తామని హెచ్చరించారు. పర్సనల్ పేజీలో వీడియో పెట్టి చేతులు దులుపుకోవడం కాదని బహిరంగంగా క్షమాపణ చెప్పాల్సిందే అని డిమాండ్ చేశారు.

Full View
Tags:    

Similar News