Flop Movie: రూ. 1200 కోట్ల పెట్టుబడి.. ప్రపంచంలోనే అతిపెద్ద ఫ్లాప్ మూవీ.. నష్టం ఎంతో తెలుసా?

Sahara Movie: సినిమా బిజినెస్ కూడా రిస్క్ కంటే తక్కువేం కాదండోయ్. సినిమా వర్క్‌ చేస్తే మేకర్స్‌కి అంతా మంచే జరుగుతుంది.

Update: 2024-10-07 07:19 GMT

Flop Movie: రూ. 1200 కోట్ల పెట్టుబడి.. ప్రపంచంలోనే అతిపెద్ద ఫ్లాప్ మూవీ.. నష్టం ఎంతో తెలుసా?

Sahara Movie: సినిమా బిజినెస్ కూడా రిస్క్ కంటే తక్కువేం కాదండోయ్. సినిమా వర్క్‌ చేస్తే మేకర్స్‌కి అంతా మంచే జరుగుతుంది. ఫెయిల్ అయితే పరిస్థితి దారుణంగా మారుతుంది. ఒక సినిమా హిట్ అయితే నిర్మాతలకే కాదు, నటీనటులకూ చాలా లాభం వస్తుంది. ఇతర పెద్ద సినిమాల నుంచి కూడా ఆఫర్లు వస్తుంటాయి. బ్రాండ్ వాల్యూ పెరగడం ప్రారంభించిన కొద్దీ, నటులు ప్రకటనలు చేస్తూ కోట్లు సంపాదిస్తుంటారు. కానీ, కథ అడ్డం తిరిగితే మాత్రం ఇండస్ట్రీలో చాలా కష్టాలు ఎదుర్కొవాల్సి వస్తుంది. భారీ బడ్జెట్ పెట్టిన సినిమా ఫెయిల్ అయితే, ఇక ఆ పరిస్థితి ఎలా ఉంటుందనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

2005లో విడుదలైన ఓ సినిమా విషయంలోనూ అదే జరిగింది. నిర్మాతలు భారీ ఖర్చుతో సినిమాను నిర్మించారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను సాధిస్తుందని అంతా భావించారు. అయితే, విడుదల తర్వాత అంతా తలకిందులైంది. నిర్మాతలు భారీగా నష్టపోయారు. కోట్లాది రూపాయల నష్టం వాటిల్లింది. తాజాగా, ప్రపంచంలోనే అతి పెద్ద ఫ్లాప్ చిత్రాల జాబితాలో ఈ సినిమా పేరు కూడా చేరిపోయింది.

IMDB 'సినిమా చరిత్రలో అతిపెద్ద బాక్స్ ఆఫీస్ ఫ్లాప్స్!' జాబితాలో ఐదో స్థానంలో నిలిచిన హాలీవుడ్ సినిమా'సహారా' కూడా ఉంది. ఈ సినిమా 2005 సంవత్సరంలో విడుదలైంది. మంచి తారాగణం ఉంది. కానీ, అది బాక్స్ ఆఫీస్ వద్ద పూర్తిగా ఆకట్టుకోలేకపోయింది. నిర్మాతలు ఏకంగా $144,857,030 (రూ. 1217 కోట్లు) కోల్పోయారు.

'సహారా' సినిమాకు బ్రెక్ ఈస్నర్ దర్శకత్వం వహించాడు. ఇది అమెరికన్ యాక్షన్-అడ్వెంచర్ చిత్రం. 1992 సంవత్సరంలో, అదే పేరుతో ఒక నవల ప్రచురించారు. దానిపై నిర్మాతలు సినిమా తీశారు. తారాగణం గురించి మాట్లాడితే, స్టీవ్ జహాన్, మాథ్యూ మెక్‌కోనాఘే, పెనెలోప్ క్రజ్ ప్రధాన పాత్రలలో కనిపించారు.

'సహారా' కథ గురించి చెప్పాలంటే, సహారా ఎడారిలో తప్పిపోయిన ఇనుప కవచంతో కూడిన యుద్ధనౌకను కనుగొనడమే. ఉత్తర ఆఫ్రికా అంతటా వ్యాపించి ఉన్న సహారా ఎడారి ప్రపంచంలోనే అతిపెద్ద ఎడారి అని అందరికీ తెలిసిందే.

'సహారా' ప్రపంచంలోనే అత్యంత ఫ్లాప్ చిత్రంగా మారింది. ఈ నివేదిక ప్రకారం, 'సహారా' ప్రపంచవ్యాప్తంగా 120 మిలియన్ డాలర్లు వసూలు చేసింది. ఈ సంఖ్య చూసేందుకు బాగానే ఉంది. కానీ 'సహారా' ప్రొడక్షన్ హౌస్ మార్కెటింగ్, సినిమా తీయడంలో దీని కంటే ఎక్కువ డబ్బు ఖర్చు చేసింది. మొత్తం ఖర్చు 240 మిలియన్ డాలర్లు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ సినిమా పూర్తి స్థాయిలో వసూళ్లు రాబట్టలేకపోయింది. ఈ నివేదిక ప్రకారం, 'సహారా' కారణంగా మేకర్స్ $144,857,030 (రూ. 1217 కోట్లు) నష్టపోయారు.

Tags:    

Similar News