Holi 2021 Special: టాలీవుడ్ లో హోలీ స్పెషల్ పాటలు ఇవే..
Holi 2021 Special: కులమత, చిన్నాపెద్ద బేధాలు లేకుండా అందరూ కలిసి సంతోషంగా చేసుకునే పండుగ హోలీ.
Holi 2021 Special: కులమత, చిన్నాపెద్ద బేధాలు లేకుండా అందరూ కలిసి సంతోషంగా చేసుకునే పండుగ హోలీ. వసంత రుతువు రాకతో పుడమి రంగులతో మారిపోతుంది. కామ, క్రోధ, మద, మాత్సర్యాలను మంటల్లో వేసి, మంచి జీవితం వైపు సాగడమే ఈ పండగ ముఖ్య ఉద్దేశ్యం. తెలుగు చిత్ర సీమలో హోలీ పాటలకు ప్రత్యేక స్థానం ఉంది. చాలా పాటలు ఈ పండగ జోష్ ను పెంచేలా చేస్తాయనడంలో సందేహం లేదు. బాగా పాపులర్ అయిన కొన్ని పాటలను ఇక్కడ మీకోసం అందిస్తున్నాం. వాటిలో నాయకుడు సినిమాలోని 'సందే పొద్దు మేఘం', రాఖీలోని 'రంగు రబ్బా రబ్బా' బాగా ఆకట్టుకున్నాయి.
నాయకుడు - సందే పొద్దు మేఘం
దక్షిణాదిన హోళీ పండుగ సందర్భంలో వచ్చిన ఈపాట బాగా పాపులర్ అయింది. బహుశా భారతీయ సినిమాలో ఇది మొదటి పాటగా నిలుస్తోంది.ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడిన ఈ పాట ఇప్పటికీ హోళీ పాటల్లో నంబర్ వన్ గా ఉంటుంది. వెన్నెలకంటి సాహిత్యం, ఇలయరాజా సంగీతం ఈ పాట అందాన్ని మరింత పెంచింది. 1987లో మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన నాయకుడు సినిమాలో కమల్ హాసన్ రంగులు జల్లుకున్నారు.
చక్రం - రంగేలి హోలీ
కృష్ణ వంశీ 'చక్రం' సినిమాలోని 'రంగోలి హోలీ' సాంగ్.. పంజాబీ బీట్స్‌తో సాగుతుంది. శంకర్ మహాదేవన్ తన స్వరంతో ఈ పాటను ఓ లెవల్ కు తీసుకెళ్లాడు. సిరివెన్నెల సీతారామ శాస్త్రి రాసిన ఈ పాటలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, హీరోయిన్ ఛార్మి ఆడి పాడారు. కోసం కంపోజ్ చేసిన ఈ పెప్పీ నంబర్‌లో ప్రభాస్ మరియు చార్మీ కౌర్ చాలా బాగా నృత్యం చేశారు. వాతావరణం మొత్తం పొరుగువారితో సందడి చేస్తుంది.
రాఖీ - రంగు రబ్బ రబ్బ
కృష్ణ వంశీ మరోసారి రంగుల హోళీ పాటను ప్రేక్షకులకు అందించారు. రాఖీ సినిమాలో'రాక్‌స్టార్' దేవి శ్రీ ప్రసాద్ కంపోజ్ చేసిన 'రంగు రబ్బా రబ్బా' హోలీ పార్టీలో ఫుల్ జోష్ లో నింపుతుందనడంలో సందేహం లేదు. సుద్దాల అశోక్ తేజ అందించిన సాహిత్యం ఆకట్టుకుంటుంది. జూనియర్ ఎన్టీఆర్ తన అద్భుతమైన డ్యాన్స్ తో దుమ్ములేగా, ఇలియానా తన అందంతో మతిపోగొడుతుంది.
జెమిని - దిల్ దీవానా
విక్టరీ వెంకటేష్ 'జెమిని'సినిమా కోసం ఆర్.పి.పట్నాయక్ దిల్ దీవానా పాటను అందించాడు. వేటూరి సుందరరామ మూర్తి రాసిన సాహిత్యం, ఉషా స్వరంతో ఈ పాట అప్పట్లో సందడి చేసింది.
సీతారామరాజు - ఏకాసేగత్తా
నాగార్జున, సాక్షి శివానంద్ నటించిన ఈ ఫాస్ట్ బీట్ 'సీతారామ రాజు'సినిమాలోనిది. ఎంఎం కీరవాణి ఈ పాటను కంపోజ్ చేశారు. ఎస్పీ బాలు, సుజాత, కీరవాణి పాడిన ఈ పాటలో నందమూరి హరికృష్ణ డ్యాన్స్ చేయడం విశేషం.
అలాగే రాఘవ లారెన్స్ దర్శకత్వంలో వచ్చిన మాస్ సినిమాలోనూ నాగార్జున రంగులతో ఆడిపాడాడు. కొట్టు కొట్టు కొట్టు రంగు తీసి కొట్టు సాంగ్ ను సాహితి రాశారు.
మంచు మనోజ్ హీరోగా వచ్చిన శ్రీ సినిమాలోనూ హోలీహోలీ అంటూ సందడి చేశాడు. దశరథ్ దర్శకత్వం వహించారు. తమన్నాతో కలిసి మనోజ్ రంగులు చల్లుకున్నాడు.
కె.రాఘవేంద్ర రావు దర్శకత్వంలో వచ్చిన పదరేళ్ల వయసు సినిమాలోనూ హోలీ పాటను అందించారు. ఇది బావ మరదలు మధ్య సాగే వయస్సంత ముడుపుకట్టి.. వసంతాలే ఆడుకుందాం.. అంటూ హోలీ సరదాలను చూపించారు.
అలాగే, నీస్నేహం, ఇంద్ర, ఓయ్, హోలీ లాంటి సినిమాల్లో హోలీ సీన్స్ తో హీరోలు రంగులు పూసుకున్నారు.
ఇది ప్రకృతి పండగ. ప్రకృతిలో దొరికే సహాజసిద్దమైన మోదుగు పూలతో తయారు చేసిన రంగులు వాడాలి. కానీ, ఇప్పుడంతా రసాయనాల రంగులే. మీరు మాత్రం రసాయనాలు లేని రంగులు వాడి ఈ హోలీని ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నాం..