HIT 3: 'అతనే ఓ ప్రమాదం'.. ఆసక్తి పెంచిన హిట్3 టీజర్..
HIT 3 Movie: పవర్ ఫుల్ అండ్ మ్యాడ్ పోలీస్ ఆఫీసర్‌గా నాని ఇందులో కనిపించనున్నాడు.
శైలేజ్ కొలను దర్శకత్వంలో వచ్చిన 'హిట్' సిరీస్ ఎంతటి విజయాన్ని అందుకున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. హిట్ ఫ్రాంచైజీలో భాగంగా ఇప్పటి వరకు వచ్చిన రెండు చిత్రాలు భారీ విజయాన్ని నమోదు చేసుకున్నాయి. హిట్1లో విశ్వక్‌సేన్, హిట్2లో అడివిశేష్ అద్భుత నటనతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేశారు.
ఇక రెండు పార్ట్స్‌కు ఇంటర్ లింక్ చేస్తూ దర్శకుడు తెరకెక్కించిన విధానం అందరినీ ఆకట్టుకుంది. పవర్ ఫుల్ పోలీసులు అంతుచిక్కను కేసులను పరిష్కరించేందుకు ఎలాంటి ఎత్తుగడలు వేస్తారు. హత్యలను ఎవరు చేస్తున్నారు.? లాంటి ఆసక్తికరమైన ఎలిమెంట్స్‌తో ఈ సినిమాలు సాగుతున్నాయన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో హిట్ సిరీస్ నుంచి మూడో సినిమా వస్తోంది. హిట్-ది థర్డ్ కేస్ పేరుతో ఈ సినిమాను తెరకెక్కిన్నాడు దర్శకుడు శైలేజ్ కొలను.
ఈ సినిమాను యునామిమస్ ప్రొడక్షన్స్‌తో కలిసి వాల్ పోస్టర్ సినిమా బ్యానర్‌పై ప్రశాంతి తిపిర్నేని నిర్మిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా చిత్ర యూనిట్ ఈ సినిమాకు సంబంధించి ఓ టీజర్‌ను విడుదల చేసింది. 'అర్జున్ సర్కార్: హంటర్స్ కమాండ్' పేరుతో విడుదల చేసిన ఈ టీజర్ ఆద్యంతం ఆకట్టుకుంటోంది. ఇందులో సరికొత్త నాని కనిపిస్తున్నాడు.
పవర్ ఫుల్ అండ్ మ్యాడ్ పోలీస్ ఆఫీసర్‌గా నాని ఇందులో కనిపించనున్నాడు. టీజర్‌లోనే అర్జున్ సర్కార్ క్యారెక్టర్ ఎలా ఉంటుందున్న విషయాన్ని దర్శకుడు చెప్పేశాడు. నాని స్టైలిష్ అండ్ అగ్రెసివ్ లుక్‌లో కనిపించారు. వచ్చే ఏడాది మే 1వ తేదీన ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది. ఇంతకీ ఈ సినిమాలో శైలైజ్ ఏ కథాంశాన్ని ఎంచుకోనున్నాడు. ప్రేక్షకులను ఎలాంటి సస్పెన్స్‌కు గురి చేయనున్నాడు తెలియాలంటే ఈ సినిమా విడుదల వరకు వేచి చూడాల్సిందే.