Lovely: 9 ఏళ్ళైనా ఆదరణ తగ్గలేదు..యూట్యూబ్‌లో అదరగొడుతున్న 'లవ్లీ' మూవీ

Lovely Movie: ఈ చిత్రంలో ఆది సాయి కుమార్, శాన్వీ జంటగా నటించారు.

Update: 2021-04-28 08:09 GMT

లవ్లీ మూవీ పోస్టర్ (ఫైల్ ఇమేజ్)

Lovely Movie: దివంగత మహిళా దర్శకురాలు బి.జయ దర్శకత్వంలో 2012 లో వచ్చిన చిత్రం 'లవ్లీ'. ఈ మూవీ మంచి విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ఆది సాయి కుమార్, శాన్వీ జంటగా నటించారు. ఈ మూవీలో రాజేంద్ర ప్రసాద్, వెన్నెల కిషోర్ కీలక పాత్రలు పోషించారు. ఇప్పుడు సినిమా గురించి ఎందుకంటారా? నార్త్ లో జనాలు హిందీ సినిమాలను కూడా పక్కన పెట్టి.. తెలుగు సినిమాలనే ఎక్కువగా వీక్షిస్తున్నారు. ఈ ఉదాహరణ మన తెలుగు సినిమాలను హిందీలో డబ్ చేసి విడుదల చెయ్యగా మిలియన్లకు మిలియన్ల వ్యూస్ నమోదవుతుండటం విశేషం.

ఇప్పుడు 'లవ్లీ' సినిమా ఓ రేంజ్ లో వ్యూస్ వస్తున్నాయి. ఏ పెద్ద హీరోకో కాకుండా ఆది నటించిన రెండో సినిమాకు రావడం విశేషం. తెలుగులో 9 ఏళ్ళ క్రితం వచ్చి హిట్ అయిన సినిమాని ఇప్పుడు డబ్ చేసి యూట్యూబ్లో విడుదల చెయ్యగా దానికి కూడా 50 మిలియన్ల వ్యూస్ నమోదయ్యాయట. 'లవ్లీ' మూవీ 'విజయ్ మేరీ హై' టైటిల్ తో హిందీ డబ్బింగ్ అయింది. హిందీలో డబ్ అయిన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి విశేషమైన స్పందన వస్తోంది.

'ఆర్.ఆర్. మూవీ' 'ఆర్జే సినిమా' పతాకంపై ఆర్.ఆర్. వెంకట్, బి.ఎ. రాజు కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు. అనూప్ రూబెన్స్ సంగీతంలో రూపొందిన ఈ చిత్రం పాటలు కూడా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.ఇదిలా ఉండగా 9 ఏళ్ళ తరువాత ఈ చిత్రాన్ని హిందీలో డబ్ చేసి యూట్యూబ్లో విడుదల చెయ్యగా.. అతి తక్కువ సమయంలోనే 50 మిలియన్లకు పైగా వ్యూస్ నమోదయ్యాయట. 'విజయ్ మేరీ హై' టైటిల్ తో 'లవ్లీ' హిందీలో డబ్ అయ్యింది.

అయితే తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు ఓపెన్ చేసినా.. కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా థియేటర్లకు వెళ్లడానికి జనం జంకుతున్నారు. అయితే నార్త్‌లో మాత్రం అలా జరగలేదు. అక్కడి మాస్ జనాలు థియేటర్లలో సినిమా చూడాలని తెగ ముచ్చట పడుతున్నారు. ఉత్తరాది రాష్ట్రాలో ప్రేక్షకులు సినిమాలు చూడాలని ఇంట్రస్ట్ ఉన్నా కరోనా వైరస్ ఎక్కువగా ఉండడంతో థియేటర్లు ఓపెన్ చేయకపోవడంతో నిరాశకు గురవుతున్నారు. ఇప్పట్లో థియేటర్స్ ఓపెన్ చేసే పరిస్థితి లేకపోవడంతో తెలుగు సినిమాలపై మనసు పారేసుకున్నారు.

Tags:    

Similar News