Vaishnavi Chaitanya: పూట గడవాలంటే.. ఆ పార్టీల్లో డ్యాన్స్ చేయాల్సిందే.. లేదంటే పస్తులే: బేబీ హీరోయిన్
Vaishnavi Chaitanya: చిన్న సిమాగా వచ్చి సెన్సేషన్ సృష్టించిన సినిమాల్లో 'బేబి' ఒకటిగా నిలిచించి. ముఖ్యంగా ఈ సినిమాలో తెలుగమ్మాయి వైష్ణవి చైతన్య నటనటకు అంతా ఫిదా అయ్యారు.
Vaishnavi Chaitanya: చిన్న సిమాగా వచ్చి సెన్సేషన్ సృష్టించిన సినిమాల్లో 'బేబి' ఒకటిగా నిలిచించి. ముఖ్యంగా ఈ సినిమాలో తెలుగమ్మాయి వైష్ణవి చైతన్య నటనటకు అంతా ఫిదా అయ్యారు. ఇండస్ట్రీలో స్టార్ హీరోలు సైతం ఆమె నటను మొచ్చుకోకుండా ఉండలేకపోయారు. అయితే, వైష్ణవికి హీరోయిన్ ఛాన్స్ అంత ఈజీగా రాలేదండోయ్.
తొలుత డబ్‌స్మాష్, టిక్‌టాక్ వీడియోలతో సోషల్ మీడియాలో బాగా ఫేమస్ అయింది.ఆ తర్వాత యూట్యూబ్‌లో షార్ట్ ఫిలింస్, కవర్ సాంగ్స్, వెబ్ సిరీస్ లాంటివి చేస్తూ ప్రేక్షకులకు దగ్గరైంది. ఈ క్రమంలో వెండితెరపై కొన్ని సినిమాల్లో ఛాన్సులు వచ్చాయి. చిన్నచిన్న పాత్రల్లో కనిపించింది.
10వ తరగతిలోనే భుజాలపై కుటుంబ బాధ్యతలు..
అందంతోపాటు ప్రతిభ ఉన్నా.. హీరోయిన్ అయ్యే అవకాశం అంత త్వరగా ఆమె చెంతకు చేరలేదు. బేబీ సినిమా దర్శకుడు సాయి రాజేశ్ వైష్ణవి వెబ్ సిరీస్‌లు చూసి, ఈ పాత్రకు సరిగ్గా సెట్ అవుతుందని భావించాడు. దీంతో హీరోయిన్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. అయితే, ఈ సినిమా ఊహించిన దాని కంటే భారీ హిట్ కొట్టింది. దీంతో వైష్ణవి చైతన్యకు ఎనలేని క్రేజ్.. ఒక్క సినిమాతోనే సొంతమైంది.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో వైష్ణవి చైతన్య మాట్లాడుతూ.. 'పదో తరగతి నుంచే కుటుంబ భారాన్ని తీసుకున్నాను. ఆ సమయంలో నాకు డ్యాన్స్ ఒక్కటే తెలుసు. బర్త్‌డే, పెళ్లి ఈవెంట్ ఏదైనా అక్కడ నేను డ్యాన్స్ చేసేదాన్ని. ఒక్కరోజు డ్యాన్స్ చేస్తే నాకు రూ.700లు ఇచ్చేవాళ్లు. అలా వచ్చిన డబ్బుతో అమ్మ బియ్యంతోపాటు ఇంట్లో సామాన్లు కొనేది' అంటూ తొలినాళ్లలో తను పడ్డ కష్టాలను చెప్పుకొచ్చింది.
దుస్తులు మార్చుకునేందుకు గది లేదు
యూట్యూబ్ కోసం వీడియోలు చేసే సమయంలో డ్రెస్ ఛేంజ్ చేసుకుందామనుకుంటే స్పెషల్ రూంలో లేవు. వాష్‌రూమ్‌కి వెళ్లి అక్కడే ఛేంజ్ చేసుకునే దాన్ని. అవి చూసిన అమ్మ బాగా ఏడ్చేది. అమ్మ వద్దు వదిలేయమ్యా అనేది. కానీ, అప్పుడే మెంటల్‌గా ఫిక్స్ అయ్యా. ఏదైనా సాధించాలని గట్టిగా అనుకున్నా. ఈ క్రమంలో ఒక సినిమాలో చిన్న పాత్రలో నటించాను. ' అని చెప్పుకొచ్చింది వైష్ణవి చైతన్య.