Shruti Haasan: బాలయ్య మూవీని రిజక్ట్ చేసిన స్టార్ హీరోయిన్‌..?

Shruti Haasan: నందమూరి బాలకృష్ణ రాబోయే చిత్రం BB3 లో హీరోయిన్ కోసం చిత్ర యూనిట్ చాలా కష్టపడుతున్నారంట.

Update: 2021-03-04 13:21 GMT

శ్రుతి హాసన్ (ఫోటో హన్స్ ఇండియా)

Shruti Haasan: నందమూరి బాలకృష్ణ రాబోయే చిత్రం BB3 లో హీరోయిన్ కోసం చిత్ర యూనిట్ చాలా కష్టపడుతున్నారంట. ఇప్పటికే ఇద్దరు హీరోయిన్స్ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. అయితే చివరకు నిర్మాతలు ప్రగ్యా జైస్వాల్ ను కన్ ఫాం చేసి షూటింగ్ ను ప్రారంభించారు.

కాగా, బాలకృష్ణ, గోపిచంద్ మలినేని కాంబినేషన్ లో వస్తున్న మరో సినిమాలోనూ హీరోయిన్ ఎంపికే సమస్యగా మారిందంట. స్టార్ హీరోయిన్లలో ఎవరూ బాలకృష్ణతో స్కీన్ పంచుకునేందుకు ఆసక్తి చూపడం లేదని సమాచారం. ఈ మేరకు మరో కొత్త నటిని చూడాలా లేదా ఉన్నవారినే ఎలా ఒప్పించాలో తెలియక అయోమయం లో పడ్డారంట.

అయితే ఆసక్తికరమైన విషయం ఏంటంటే..శ్రుతి హాసన్ ను ఈ సినిమాలో నటించేందుకు డైరెక్టర్ ప్రయత్నాలు చేయగా..ఆమె కూడా ఈ ఆఫర్ ను తిరస్కరించిందంట. కారణాలు మాత్రం తెలియారాలేదని సమాచారం. క్రాక్ మూవి సూపర్ హిట్ అవడంతో జోరు మీదున్న శ్రుతిహాసన్..ప్రస్తుతం ప్రభాస్ 'సలార్' మూవీలో హీరోయిన్ గా నటిస్తోంది. మరోవైపు గోపిచంద్ మలినేని డైరెక్షన్ లో బాలయ్య బాబుతో రోమాన్స్ చేయడానికి ఏ హీరోయిన్ ఒప్పుకుంటుందో వేచి చూడాలి. 

Tags:    

Similar News