Green India Challenge: తాను నాటిన మొక్కకు పునీత్ పేరు పెట్టిన నటుడు విశాల్
Green India Challenge: గ్లోబల్ వార్మింగ్ ను అరికట్టడానికి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అద్భుతమైన కార్యక్రమమని అన్నారు నటుడు విశాల్.
Green India Challenge: గ్లోబల్ వార్మింగ్ ను అరికట్టడానికి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అద్భుతమైన కార్యక్రమమని అన్నారు నటుడు విశాల్. ఎనిమీ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా హైదరాబాద్ వచ్చిన చిత్ర యూనిట్ హైటెక్స్ ప్రాంగణంలో మొక్కలు నాటారు. ఇటీవలే కన్నుమూసిన ఆప్త మిత్రుడు, నటుడు పునీత్ రాజ్ కుమార్ పేరును మొక్కకు పెట్టిన విశాల్ ఇది ఎప్పటికీ పునీత్ గుర్తుగా మిగిలిపోతుందని అన్నారు. కాలాలు, సంస్కృతులు, స్మృతుల్ని తనలో మిళితం చేసుకుని గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ముందుకు సాగుతోందని విశాల్ అన్నారు.
రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మానసపుత్రిక "హరితహారం" స్పూర్తితో ప్రారంభించిన ఈ ఉద్యమం మానవాళికి మేలు చేస్తుందన్నారు. భవిష్యత్ తరాలకు మంచి పర్యవరణాన్ని అందించాలంటే ప్రతి ఒక్కరు విధిగా మొక్కలు నాటాలని నటుడు ఆర్యా కోరారు."గ్రీన్ ఇండియా చాలెంజ్" కో ఫౌండర్ రాఘవ వృక్షవేదం పుస్తకాన్ని ఎనిమీ చిత్ర బృందానికి అందజేశారు.