అభిమానుల కోసం వెంకీ బర్త్ డే స్పెషల్ ట్రీట్!
ఈ న్యూ లుక్‌లో వెంకీ చాలా స్టైలిష్ గా కనిపిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. సాల్ట్ అండ్ పెప్పర్ లుక్‌లో, గెడ్డంతో స్టైలిష్‌గా అట్రాక్ట్ గా కనిపిస్తున్నారు. అయితే ఈ స్టిల్స్ కాజువల్‌గా అని యూనిట్ చెబుతున్నప్పటికీ వెంకీ తన తదుపరి చిత్రంలో ఇలాగే కనిపించనున్నారని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.
అటు క్లాస్, ఇటు మాస్ చిత్రాలతో గత కొన్ని దశాబ్దాలుగా ప్రేక్షకులను అలరిస్త్హున్నారు హీరో వెంకటేష్. రేపు వెంకటేష్ ( డిసెంబర్ 13) న 60 వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్బంగా వెంకటేష్ ప్రస్తుతం నటిస్తున్న నారప్ప చిత్రం నుంచి కొన్ని స్టిల్స్ తో పాటుగా మరికొన్ని పిక్స్ ని రిలీజ్ చేశారు మేకర్స్. ఈ న్యూ లుక్‌లో వెంకీ చాలా స్టైలిష్ గా కనిపిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. సాల్ట్ అండ్ పెప్పర్ లుక్‌లో, గెడ్డంతో స్టైలిష్‌గా అట్రాక్ట్ గా కనిపిస్తున్నారు. అయితే ఈ స్టిల్స్ కాజువల్‌గా అని యూనిట్ చెబుతున్నప్పటికీ వెంకీ తన తదుపరి చిత్రంలో ఇలాగే కనిపించనున్నారని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.
ఇక వెంకటేష్ నారప్ప సినిమా విషయానికి వచ్చేసరికి తమిళ్ లో ధనుష్ , మంజు వారియర్ కలిసి నటించిన అసురన్ సినిమాకి ఇది రీమేక్. ఈ సినిమా తమిళ్ లో మంచి హిట్ అవడం, సీనియర్ హీరో వెంకటేష్ దీనిని రీమేక్ చేస్తుండడంతో సినిమా పైన మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ప్రతీకార కథాంశంతో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో మధ్యవయస్కుడైన వ్యక్తిగా వెంకటేష్ నటిస్తున్నాడు. శ్రీకాంత్ అడ్డాల డైరెక్షన్ లో తెరకెక్కనున్న ఈ సినిమాని సురేష్ ప్రొడక్షన్స్, వి క్రియేషన్స్ నిర్మాతలు అయిన సురేష్ బాబు, కళైపులి ఎస్ థాను కలిసి సంయుక్తంగా నిమిస్తున్నారు. ఈ సినిమాలో వెంకటేష్ సరసన ప్రియమణి హీరోయిన్ గా నటిస్తోంది.
ఇక ఈ సినిమా తర్వాత వెంకటేష్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఎఫ్ 2 కి సీక్వెల్ చేయనున్నారు. ఇందులో వెంకటేష్ తో పాటు వరుణ్ తేజ్ కూడా నటిస్తున్నాడు. ఎఫ్2 సినిమాని నిర్మించిన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ఈ సినిమాని నిర్మిస్తుంది.