Sandeep Kishan Comment on Electricity Bills: కరెంట్ బిల్లులు సినిమాల వీకెండ్‌ కలెక్షన్లలా వస్తున్నాయి... సందీప్ కిషన్ సెటైర్లు

Sandeep Kishan Comment on Electricity Bills: ఒక పక్కా కరోనాతోనే జనాలు బిక్కుబిక్కుమంటూ జీవనం సాగిస్తుంటే మరో పక్కా కరెంట్ బిల్లులు జనాలకు మరింత షాక్ ని ఇస్తున్నాయి

Update: 2020-07-01 09:45 GMT

Sandeep Kishan Comment on Electricity Bills: ఒక పక్కా కరోనాతోనే జనాలు బిక్కుబిక్కుమంటూ జీవనం సాగిస్తుంటే మరో పక్కా కరెంట్ బిల్లులు జనాలకు మరింత షాక్ ని ఇస్తున్నాయి. నిజానికి వాడుకున్న కరెంట్ కి, వచ్చే బిల్లుకి అస్సలు సంబంధం లేకుండాపోతుంది.. చిన్న చిన్న గుడిసెలకు కూడా లక్షల్లో బిల్లు వస్తున్నాయి. ఈ సమస్య కేవలం సామాన్యులే కాదు.. సెలబ్రిటీలు కూడా ఎదురుకుంటున్నారు.. ఇప్పటికే ఈ సమస్యను యంగ్ హీరోయిన్స్ అయిన కార్తీక, తాప్సీకి ఎదురైన సంగతి తెలిసిందే..

తాజాగా ఈ కరెంట్ బిల్లులపై యంగ్ హీరో సందీప్ కిషన్ తన ట్విట్టర్ వేదికగా స్పందించాడు. 'పవర్ బిల్లులు ఇలాగే వస్తే.. నెక్ట్స్ ఎవరి ఇంటికి ఎక్కువ బిల్లు వచ్చింది అని ఆన్‌లైన్‌ వార్‌ స్టార్ట్ అయినా ఆశ్చర్యం లేదు' అంటూ ట్వీట్ చేశారు. 'మా ఇంట్లోని ఎలక్ట్రిసిటీ బోర్డు మీటర్‌ని చూస్తే చిన్నప్పుడు గిర్రుమంటూ తిరిగే ఆటో రిక్షా మీటర్‌ గుర్తొచ్చింది. ఏంది సర్‌ ఆ బిల్లులు. కొత్తగా రిలీజైన సినిమాల వీకెండ్‌ కలెక్షన్లలా కరెంట్‌ బిల్లులు ఉన్నాయి' అంటూ ట్వీట్ చేశాడు సందీప్... అయితే తనకి ఎంత కరెంట్ బిల్లు వచ్చింది అన్నదానిపై మాత్రం సందీప్ స్పందించలేదు.. ఇంతకీ మీకు కరెంట్ బిల్ ఎంత వచ్చింది? అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.

ఇక సందీప్ కిషన్ సినిమాల విషయానికి వచ్చేసరికి స్నేహగీతం, ప్రస్థానం' చిత్రాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడైన సందీప్‌కిషన్‌ బాలీవుడ్ లోనూ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు

. ఇక 2010లో టాప్‌ 3 చిత్రాల్లో ఒకటైన 'షోర్‌ ఇన్‌ ద సిటీ' చిత్రం ద్వారా బాలీవుడ్‌కు పరిచయమైయ్యాడు... ఇక గుండెల్లో గోదారి, వెంకటాద్రి ఎక్స్ ప్రెస్, జోరు, బీరువా మొదలగు సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక గత ఏడాది తెనాలి రామకృష్ణ బీ.ఏ సినిమాతో ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం తెలుగు, తమిళ్ భాషలలో రెండేసి చిత్రాలు చేస్తున్నాడు సందీప్. 

Tags:    

Similar News