Pawan Kalyan : ఆ వీడియోకి పవన్ ఫిదా.. మ‌న మాతృభూమి అంటే ఇది అంటూ ట్వీట్!

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ఓ సినిమా నటుడుగానే కాకుండా సమాజం పట్ల బాధ్యతగా ఉన్న వ్యక్తిగా

Update: 2020-08-30 15:06 GMT

pawan kalyan

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ఓ సినిమా నటుడుగానే కాకుండా సమాజం పట్ల బాధ్యతగా ఉన్న వ్యక్తిగా చాలా సార్లు నిరూపించుకున్నారు పవన్ కళ్యాణ్.. కుల‌మ‌తాల‌క‌తీతంగా మనమంతా భార‌తీయులం..మ‌నమంతా ఒక్కటేననే సందేశాన్ని ఎప్పుడు ఇస్తుంటారు అయన.. దేశం పట్ల, సమాజం పట్ల అయన తన మక్కువను సోష‌ల్ మీడియా వేదిక‌గా అభిమానులకి చేరవేస్తుంటారు పవన్.. ఇక ఇది ఇలా ఉంటే తాజాగా సోషల్ మీడియాలోని ఓ వీడియో పవన్ ని బాగా ఆకట్టుకుంది.

బెంగ‌ళూరులోని ఓ ఆల‌యం ద‌గ్గర అల్లర్ల స‌మ‌యంలో ముస్లిం సోద‌రులు మాన‌వ‌హారంలా నిల‌బ‌డి ఘ‌ర్షణ‌లు జ‌రుగ‌కుండా చూశారు. కరోనా లాంటి విపత్కరమైన సమయంలో ముస్లిం సోద‌రులు చూపించిన ఔదార్యం పవన్ ని బాగా ఆకట్టుకుంది. ఈ వీడియోని ట్వీట్ చేసిన పవన్.. మ‌న మాతృభూమి అంటే ఇది. మ‌న మాతృభూమి గొప్పద‌నం. భార‌త‌దేశ గొప్పద‌నం అంటూ ట్వీట్ చేశారు ప‌వ‌న్‌. ప్రసుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది..



ఇక పవన్ కళ్యాణ్ అటు రాజకీయాలతో పాటు ఇటు సినిమాలతో బిజీగా ఉన్నారు.. ఇప్పటికే మూడు సినిమాలను కమిట్ అయ్యాడు పవన్.. అందులో భాగంగా అయన రీఎంట్రీ మూవీగా వకీల్ సాబ్ తెరకెక్కుతుంది. హిందీలో వచ్చిన పింక్ సినిమాకి ఇది రీమేక్ ..ఇందులో పవన్ కళ్యాణ్ తో పాటుగా అంజలి, నివేతా థామస్, అనన్య పాండే హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ సినిమాకి ఓ మై ఫ్రెండ్ ఫేం వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తుండగా, బోనీ క‌పూర్‌, దిల్ రాజు కలిసి సంయుక్తంగా సినిమాని నిర్మిస్తున్నారు.

Tags:    

Similar News