Hero Nikhil: మెడికల్ ఎమర్జెన్సీ అంటే వదల్లేదు..పోలీసులపై నిఖిల్ ట్వీట్
Hero Nikhil: టాలీవుడ్ యుత్ స్టార్ నిఖిల్ బయటకు రావడంతో ఆయనకు చేదు అనుభవం ఎదురైంది.
Hero Nikhil: దేశవ్యాప్తంగా కరోనా రెండో వేవ్ ప్రకంపనలు సృష్టిస్తుంది. కరోనా కట్టడికి ఆయా రాష్ట్రాలు కఠిన నిబంధనలు అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే కరోనా కట్టడికి తెలంగాణ ప్రభుత్వం కఠిన లాక్ డౌన్ అమలు చేస్తుంది. లాక్ డౌన్ సమయంలో ప్రజలు ఇళ్లలోంచి బయటకు రావద్దొని చెప్పింది. అత్యవసర పనుల మీద బయటకు రావాలంటే కచ్చితంగా ఈ పాస్ ద్వారా అనుమతులు పొందాలి సూచింది. ఈ నేపథ్యంలో సీనినటుడు, టాలీవుడ్ యుత్ స్టార్ నిఖిల్ బయటకు రావడంతో ఆయనకు చేదు అనుభవం ఎదురైంది.
నిఖిల్ సామాజిక సేవ చేయడంలో ముందుంటారు. అనేక సేవ కార్యక్రమాలు కూడా నిర్వహించారు. అయితే తాజాగా కొవిడ్ బాధితుడికి మందులు అందించేందుకు ఆసుపత్రికి వెళ్తుండగా పోలీసులు ఆయన్ని నిలిపివేశారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ నిఖిల్ ఓ ట్వీట్ పెట్టారు. 'కొవిడ్ వల్ల తీవ్రంగా ఇబ్బంది పడుతున్న ఓ వ్యక్తికి మందులు అందించేందుకు ఉప్పల్ నుంచి కిమ్స్ మినిస్టర్స్ రోడ్డులో ప్రయాణిస్తున్న సమయంలో పోలీసులు నా కారుని ఆపేశారు. ఈ-పాస్ ఉండాల్సిందే అని చెప్పేశారు. అప్పటికీ నేను తొమ్మిదిసార్లు ప్రయత్నించినప్పటికీ సర్వర్లు డౌన్ కావడం వల్ల నాకు ఈ పాస్ దొరకలేదు.
బాధితుడి వివరాలు, వైద్యుడి రాసిన మందుల చీటి చూపించినప్పటికీ పోలీసులు నన్ను అనుమతించలేదు. మెడికల్ ఎమర్జెన్సీ అని చెబితే అనుమతి ఇస్తారని భావించి.. వచ్చాను' అని నిఖిల్ ట్వీట్ పెట్టారు. నిఖిల్ ట్వీట్‌పై హైదరాబాద్ సిటీ పోలీస్ విభాగం స్పందించింది. 'డియర్ సర్, మీ లొకేషన్ ఒక్కసారి మాకు పంపించండి స్థానిక అధికారులతో మాట్లాడి మీ సమస్యను తీరుస్తాం' అని రిప్లై ఇచ్చింది. నికిల్ కార్తీయ మూవీ సిక్వెల్ బీజీలో ఉన్నాడు. కరోనా కారణంగా సినిమా షూటింగ్ నిలిచిపోయింది. 2019లో వచ్చిన అర్జున్ సురవరం సినిమా బాక్సాఫిసు వద్ద పర్వాలేదనిపించింది.