Mohan Babu : భోజనం లేక బాలసుబ్రహ్మణ్యం దగ్గర 100 రూపాయలు అప్పు చేశా.. ఇంకా తీర్చలేదు : మోహన్ బాబు

Mohan Babu : దేశవ్యాప్తంగా కరోనా విలయతాండవం చేస్తోంది.. వివిధ రాష్ట్రాల నుంచి వస్తున్న కేసులతో రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదు అవుతున్నాయి

Update: 2020-08-24 05:27 GMT

Mohan Babu 

Mohan Babu : దేశవ్యాప్తంగా కరోనా విలయతాండవం చేస్తోంది.. వివిధ రాష్ట్రాల నుంచి వస్తున్న కేసులతో రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదు అవుతున్నాయి.. ఇక ఈ కరోనా ప్రభావం ఎక్కువగా సినీ ఇండస్ట్రీ పైన ఉందని చెప్పాలి.. ఇప్పటికే చాలా మంది సెలబ్రిటీలు కరోనా బారిన పడ్డారు.. అందులో ఒకరు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఒకరు.. అయనకి కరోనా సోకి ఆగస్టు 05న కరోనా బారిన పడి చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రిలో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నారు.. అయన త్వరగా కోలుకోవాలని అభిమానులతో పాటుగా యావత్ సినీ లోకం కోరుకుంటుంది..

అయితే తాజాగా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంతో ఉన్న అనుభందాన్ని కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు.. ఆయనతో సాన్నిహిత్యం, ఆ నాటి సంగతులను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు మోహన్ బాబు.. ఇందులో మోహన్ బాబు మాట్లాడుతూ.. " బాలు నేను మంచి స్నేహితులం.. నేను బాలు అంటే అయన నన్ను శిశుపాల, భక్త అంటుండేవాడు.. ఎప్పుడో ఒకసారి మోహన్ బాబు అంటాడు. నాకు చిన్నతనం నుంచే.. అంటే కాళహస్తిలో బడికి పోయే రోజుల్లో నుంచే మాకు మంచి సాన్నిహిత్యం ఉంది.

అయితే ఒకానొక సందర్భంలో భోజనానికి డబ్బు లేకా బాలు దగ్గర వంద రూపాయల అప్పు చేశాను.. ఇప్పటికి ఆ డబ్బును ఇంకా తీర్చలేదు.. దీనితో బాలు అప్పుడప్పుడూ అంటూ ఉంటాడు.. ఏమయ్యా మోహన్ బాబు ఆ 100 రూపాయలు ఇంకా ఇవ్వలేదు. ఇప్పటికి అది కోటి అయి ఉంటుందని.. నీ అద్భుతమైన గొంతుతో సకల దేవతల పాటలు పాడావు.. వారి ఆశీస్సులతో నువ్వు త్వరగా కోలుకొని అందరం కోరుకుందాం" అని మోహన్ బాబు అన్నారు.  

Tags:    

Similar News