"అన్నయ్య సినిమాతోనే దర్శకుడిగా మారతాను" అంటున్న కార్తీ

Hero Karthi: ప్రముఖ కోలీవుడ్ నటుడు శివకుమార్ తనయుడిగా మరియు స్టార్ హీరో సూర్య తమ్ముడిగా కార్తీ శివకుమార్ ఇండస్ట్రీలో హీరోగా అడుగుపెట్టారు.

Update: 2022-10-25 16:00 GMT
Hero Karthi Wants to Cast his Brother Suriya in his Directional Debut

"అన్నయ్య సినిమాతోనే దర్శకుడిగా మారతాను" అంటున్న కార్తీ

  • whatsapp icon

Hero Karthi: ప్రముఖ కోలీవుడ్ నటుడు శివకుమార్ తనయుడిగా మరియు స్టార్ హీరో సూర్య తమ్ముడిగా కార్తీ శివకుమార్ ఇండస్ట్రీలో హీరోగా అడుగుపెట్టారు. విభిన్న కథలతో తనదైన శైలిలో ప్రేక్షకులను అలరిస్తూ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. హీరోగా ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలను అందుకున్న కార్తీ ఈ మధ్యనే "సర్దార్" సినిమాతో మరొక సూపర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నారు. ఈ మధ్యనే విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లు నమోదు చేసుకుంటుంది.

అటు తమిళ్లో మాత్రమే కాక తెలుగులో కూడా ఈ సినిమా మంచి విజయాన్ని సాధించింది. తాజాగా చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా మాట్లాడుతూ దర్శకత్వం గురించి రియాక్ట్ అయ్యారు కార్తీ. "అన్నయ్య కాకుండా నన్ను ఇంకా ఎవరు నమ్ముతారు. నా చెయ్యి పట్టుకుని తానే నన్ను ఇండస్ట్రీలోకి తీసుకొచ్చాడు. ఎప్పటికైనా తనతో ఒక సినిమా చేయాలని నా కల. ఎలాంటి పాత్రలోనైనా ఇట్టే ఒదిగిపోయి ఆ పాత్రకి పూర్తి న్యాయం చేస్తాడు.

నేను అసిస్టెంట్ డైరెక్టర్ గా మారినప్పటి నుంచి అన్నయ్య కి హీరోగా ఒక సినిమాకి దర్శకత్వం వహించాలని అనుకునేవాడిని. తనతో పని చేయటం నాకు చాలా ఈజీ. నన్ను తను చాలా బాగా అర్థం చేసుకుంటాడు. ఒకవేళ నేను ఎప్పుడైనా కన్ఫ్యూషన్ లో ఉన్నా కూడా అది తనకి ఇట్టే అర్థమయిపోతుంది," అని చెప్పుకొచ్చాడు కార్తీ. ఇక సూర్యకి దర్శకత్వం వహించాలనే కార్తీ కల నిజం కావాలని అభిమానులు కూడా కోరుకుంటున్నారు.

Tags:    

Similar News