బాలుకి భారతరత్న ఇవ్వాలి : హీరో అర్జున్
Arjun Demands Bharat Ratna To SP Balu :తన గాత్రంతో ఎన్నో పాటలు పాడి చాలా మంది అభిమానులను సొంతం చేసుకున్నారు గానగందర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం.. అయితే గత కొద్దిరోజులుగా ఆయన చెన్నైలోని MGM ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నిన్న మృతి చెందారు.
Arjun Demands Bharat Ratna To SP Balu :తన గాత్రంతో ఎన్నో పాటలు పాడి చాలా మంది అభిమానులను సొంతం చేసుకున్నారు గానగందర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం.. అయితే గత కొద్దిరోజులుగా ఆయన చెన్నైలోని MGM ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నిన్న మృతి చెందారు. కొద్దిసేపటి క్రితమే చెన్నై సమీపంలోని తామరైపాక్కం ఫాంహౌస్‌లో అయన అంతిమ సంస్కారాలు జరిగాయి. బాలు అంత్యక్రియలకి హాజరైన హీరో అర్జున్ బాలుకి నివాళులు అర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన అర్జున్ .. ఎస్పీ బాలుకి భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇందుకోసం తెలుగు, మలయాళ, తమిళం ఇండస్ట్రీలు అన్ని కలసి రావాలని అన్నారు. 45 వేల పాటలు రెండు జన్మలు ఎత్తిన పాడలేరు అని అర్జున్ వెల్లడించారు. అటు అభిమానులు కూడా బాలు కూడా భారతరత్న ఇవ్వాలని సోషల్ మీడియా వేదికగా డిమాండ్ చేస్తున్నారు.
ఇక ఎస్పీ బాలు నెల్లూరు జిల్లాలోని కోనేటమ్మపేట గ్రామంలో ఒక సాంప్రదాయ శైవ బ్రాహ్మణ కుటుంబములో జన్మించారు. తండ్రి హరికథా కళాకారుడు కావడంతో బాలుకు చిన్నప్పటి నుంచే సంగీతం మీద ఆసక్తి ఏర్పడింది. తండ్రి కోరిక మేరకు మద్రాసులో ఇంజనీరింగ్ కోర్సులో చేరాడు. చదువుకుంటూనే వేదికల మీద పాటలు పాడుతూ పాల్గొంటూ బహుమతులు సాధించారు. 1966 లో పద్మనాభం నిర్మించిన శ్రీ శ్రీ శ్రీ మర్యాద రామన్న చిత్రంతో సినీ గాయకుడిగా ఆయన సినీ ప్రస్థానం ప్రారంభమైంది. కేవలం గాయకుడిగా మాత్రమే కాకుండా డబ్బింగ్ ఆర్టిస్ట్ గా, నటుడిగా, సంగీత దర్శకుడిగా కూడా మెప్పించారు. 40 ఏళ్ళ సినీప్రస్తానంలో 40 వేల పాటలు 16 భాషలలో పాటలు పాడారు.. అత్యధిక పాటలు రికార్డు చేసిన గాయకుడిగా ఆయన పేరిట ఒక రికార్డు కూడా ఉంది.