Allu Arjun Emotional Tweet : తాతను గుర్తుచేసుకుంటూ బన్నీ ఎమోషనల్ ట్వీట్!

సినిమా ఇండస్ట్రీలో అతికొద్ద మంది మాత్రమే తమకంటూ ఓ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుంటారు. ఆ కొద్దిమందిలో దివంగత

Update: 2020-07-31 07:41 GMT
Allu Ramalingaiah, Allu Arjun(File Photo)

Allu Arjun Emotional Tweet : సినిమా ఇండస్ట్రీలో అతికొద్ద మంది మాత్రమే తమకంటూ ఓ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుంటారు. ఆ కొద్దిమందిలో దివంగత నటుడు అల్లు రామలింగయ్య ఒకరు.. ద‌శాబ్ధాల కాలం పాటు తెలుగు ప్రేక్షకుల‌ను త‌న హాస్యంతో న‌వ్వులు పువ్వులు పూయించారు అల్లు రామలింగయ్య.. హాస్యంతో పాటు విల‌నిజాన్ని కూడా పండించారయన.. 50ఏళ్ళ పాటు సినీ ప‌రిశ్రమ‌కి త‌న సేవ‌ల‌నందించిన అయన 2004 జూలై 31న ఆయ‌న అనారోగ్యంతో క‌న్నుమూశారు. భౌతికంగా అయన ప్రేక్షకుల మధ్య లేనప్పటికీ, సినిమాల ద్వారా అయన ఎప్పటికి బ్రతికే ఉంటారు.. నేడు అయన వర్దంతి..

అయన వారసత్వం పుచ్చుకొని సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు అయన మనవడు అల్లు అర్జున్ . తన తాత‌య్య వ‌ర్ధంతిని పుర‌స్కరించుకొని బ‌న్నీ ఎమోష‌న‌ల్ ట్వీట్ చేశారు. "మీరు మ‌మ్మల్ని విడిచిపెట్టి వెళ్లిన రోజు ఇంకా గుర్తు ఉంది. ఆ రోజు క‌న్నా మా తాత గొప్పత‌నం ఈ రోజు నాకు బాగా తెలిసింది. జీవితంలో చాలా విషయాలు నేను ఆయన నుంచి నేర్చుకున్నాను. ఆయన కృషి, పట్టుదల, పోరాటాలకు నేను చాలా కనెక్ట్ అయ్యాను . సినిమాల‌పై ఓ పేద రైతుకున్న ఆస‌క్తి కార‌ణంగానే ఈరోజు మేమీ స్థాయిలో ఉన్నాం'' అంటూ ఎమోషనల్ ట్వీట్ చేశాడు అల్లు అర్జున్..


ఇక అల్లు రామలింగయ్య 1922 అక్టోబర్ 1న పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో జన్మించారు. నాటకాల మీద ఉన్న ఆసక్తితో అయన సినిమాల్లోకి వచ్చారు. ఇక 1952లో ప్రముఖ సినీ దర్శకుడు రాజారావు నిర్మించిన పుట్టిల్లు సినిమాలో రామలింగయ్య తొలిసారిగా తెలుగు చలన చిత్ర పరిశ్రమకు పరిచయం అయ్యారు. ఆ సినిమాలో అయన పురోహితుడు పాత్రను పోషించారు. అలా 1000కి పైగా చిత్రాల్లో నటించారు అల్లు రామలింగయ్య.. ఆయన చిత్రపరిశ్రమకి అందించిన సేవలకి గాను 1990లో ' పద్మశ్రీ ' అవార్డుతో గౌరవించింది భారత ప్రభుత్వం. రేలంగి తరువాత ' పద్మశ్రీ' అందుకున్న హాస్యనటుడు అల్లు రామలింగయ్య కావడం విశేషం.. 

Tags:    

Similar News