గీత గోవిందం, బాహుబలి, రంగస్థలం లాంటి బ్లాక్ బాస్టర్ సినిమాలు వదులుకున్న హీరోయిన్స్ వీళ్లే..
* సూపర్ హిట్ సినిమాలు వదులుకున్న హీరోయిన్లు
Heroins: కొన్ని కొన్ని సార్లు ఒక హీరోయిన్ కాదనుకున్న కథ మరొకరి చేతిలోకి వెళుతుంది. కానీ ఆ సినిమా సూపర్ హిట్ అయితే మాత్రం ఒక గోల్డెన్ అవకాశాన్ని చేజార్చుకున్నట్లు అవుతుంది. ఏవో కారణాల చేత కొంతమంది హీరోయిన్లు సూపర్ హిట్ సినిమాలను వదులుకున్నారు. కానీ ఆ సినిమాలతో వేరే హీరోయిన్లు మంచి క్రేజ్ సంపాదించుకున్నారు. అలా సూపర్ హిట్ సినిమాలను వదులుకున్న కొంతమంది హీరోయిన్లు ఎవరో చూద్దాం..
రాశి ఖన్నా (గీత గోవిందం):
పరశురామ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా విడుదలైన సూపర్ హిట్ సినిమా "గీతా గోవిందం" కథ ముందుగా రాశి ఖన్నా వద్దకు వెళ్ళింది. కానీ డేట్లు కుదరకపోవడంతో రాశి ఖన్నా ఈ సినిమా నుంచి తప్పుకుంది. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన రష్మిక మందన్న ఇప్పుడు నేషనల్ క్రష్ గా మారిపోయింది.
అనుపమ పరమేశ్వరన్ (రంగస్థలం):
సుకుమార్ ముందుగా రంగస్థలం సినిమాలో హీరోయిన్ పాత్ర కోసం అనుపమ పరమేశ్వరన్ ను అనుకున్నారట. కానీ అనుపమ ఇంకా అమ్మ గూర్చి అని అనుకున్నా సుకుమార్ సమంత ను చేశారు.
సోనం కపూర్ (బాహుబలి):
ప్రపంచం మొత్తాన్ని ఒక్కసారిగా టాలీవుడ్ వైపు చూసేలా చేసిన బాహుబలి సినిమాలో తమన్నా పాత్రకి ముందుగా సోనంకపూర్ణి అనుకున్నారట కానీ ఆమె ఈ సినిమాకి నో చెప్పింది.
పార్వతీ నాయర్ (అర్జున్ రెడ్డి):
కల్ట్ సినిమాగా మారిన అర్జున్ రెడ్డి లో ముందుగా హీరోయిన్ పాత్ర కోసం పార్వతీ నగర్ ను అనుకున్నారట కానీ బోల్డ్ సీన్స్ ఎక్కువగా ఉండటంతో ఈ సినిమాకి నో చెప్పింది అట.
చాందిని చౌదరి (కుమారి 21ఎఫ్):
షార్ట్ ఫిలిమ్స్ తో మంచి పేరు తెచ్చుకున్న చాందిని చౌదరికి "కుమారి 21 ఎఫ్" లో హీరోయిన్ గా నటించే అవకాశం వచ్చింది కానీ ఈమె కూడా బోల్డ్ సన్నివేశాలు ఎక్కువగా ఉన్నాయంటూ సినిమాని తిరస్కరించిందట.