Hema Malini: ఆస్తుల్లో కొడుకును మించిన తల్లి.. సన్నీ డియోల్ కన్నా హేమా మాలిని ఆస్తులే ఎక్కువ..ఎంతంటే ?

Hema Malini : బీజేపీ ఎంపీ, ప్రముఖ బాలీవుడ్ నటి హేమ మాలిని ఇప్పటికీ తన అందంతో తన అభిమానులను అలరిస్తోంది. ఒకప్పుడు సినిమాల్లో ఓ ఊపు ఊపిన హేమమాలి..ఇప్పుడు రాజకీయాల్లోనే అదే దూకుడును ప్రదర్శిస్తోంది. హేమమాలిని విలాసావంతమైన జీవితాన్ని గడుపుతున్నారు.ఆమె ఆస్తుల విలువ ఎంతో తెలుస్తే మీరు షాక్ అవుతారు.

Update: 2024-10-16 03:40 GMT

Hema Malini: ఆస్తుల్లో కొడుకును మించిన తల్లి.. సన్నీ డియోల్ కన్నా హేమా మాలిని ఆస్తులే ఎక్కువ..ఎంతంటే ?

Hema Malini Birthday: బాలీవుడ్ డ్రీమ్ గర్ల్ హేమమాలిని ఎవర్ గ్రీన్ నటి. చాలా ఏళ్లుగా బుల్లితెరకు దూరంగా ఉన్న ఈ భామ..పూర్తిగా రాజకీయాల్లో యాక్టివ్‌గా ఉంటోంది. 2003లో రాజ్యసభ ఎంపీ అయిన తర్వాత హేమమాలిని 2004లో బీజేపీలో చేరారు. 70, 80 దశకాల్లో తన నటనతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసి 'డ్రీమ్ గర్ల్' అనే బిరుదు పొందింది హేమమాలిని.నేడు హేమమాలిని పుట్టినరోజు (అక్టోబర్ 16)..నేటితో 76వ వసంతంలోకి అటుపెడుతున్నారు. ఎన్నో సూపర్‌హిట్ చిత్రాలను అందించిన హేమమాలిన విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నారు. హేమమాలిని పుట్టినరోజు సందర్భంగా ఆమె ఆస్తుల గురించి తెలుసుకుందాం.

2024 లోక్‌సభ ఎన్నికలకు మథుర నుండి నామినేషన్ దాఖలు చేస్తున్నప్పుడు, హేమ మాలిని తన మొత్తం ఆస్తులు రూ. 142 కోట్లు అని ప్రభుత్వ అఫిడవిట్‌లో తెలిపారు. మొత్తం ఆస్తులలో ఆమె ఆస్తుల విలువ రూ. 1,23,61,26,601... అప్పులు రూ. 1,42,21,695. ఆమె భర్త నటుడు ధర్మేంద్ర నికర విలువ రూ. 26,52,32,266. అప్పులు రూ. 6,49,67,402, అతని నికర విలువ రూ. 20,02,64,864. హేమమాలినికి వృత్తి రీత్యా ఆదాయ వనరు కూడా నటనే అని పేర్కొంది. ఇవే కాదు వారి ఆదాయ వనరులు అద్దె, వడ్డీ ద్వారా కూడా ఆదాయం వస్తుంది.

అఫిడవిట్ ప్రకారం, హేమమాలిని 2012 సంవత్సరంలో ఉదయపూర్‌లోని సర్ పదంపట్ సింఘానియా విశ్వవిద్యాలయం నుండి గౌరవ పిహెచ్‌డి పట్టా పొందారు. ఆమె వద్ద రూ.13,52,865 నగదు ఉండగా, ఆమె భర్త ధర్మేంద్ర డియోల్ వద్ద రూ.43,19,016 నగదు ఉంది. ఇది కాకుండా ఆమె పేరు మీద బ్యాంకు ఖాతాలో రూ.99,93,177, భర్త బ్యాంకు ఖాతాలో రూ.3,52,99,371 ఉన్నాయి. కంపెనీలు, బాండ్లు, డిబెంచర్లు, మ్యూచువల్ ఫండ్స్, ఇతరాలలో ఆమె పెట్టుబడులు రూ. 2,57,92,886 కాగా, ఆమె భర్త ధర్మేంద్ర వద్ద రూ. 4,55,14,871 పెట్టుబడులు ఉన్నాయి. వ్యక్తిగత రుణాలు లేదా వ్యక్తులు, సంస్థలు మొదలైన వాటికి ఇచ్చిన అడ్వాన్సుల కింద, హేమ మాలిని పేరు మీద రూ. 4,28,54,044 ఆమె భర్త పేరు మీద రూ. 7,19,13,764 ఉన్నాయి.

అంతేకాదు హేమమాలిని వద్ద ఎన్నో లగ్జరీకార్లు ఉన్నాయి. హేమ మాలిని వద్ద రూ. 61,53,816 విలువైన కార్లు ఉన్నాయి. వీటిలో మెర్సిడెస్ బెంజ్, అల్-కజార్, మారుతీ ఈకో మొదలైనవి ఉన్నాయి. ఆమె భర్తకు రేంజ్ రోవర్, మహీంద్రా బొలెరో, మోటారు బైక్ కూడా ఉన్నాయి. ఇవే కాదు బంగారం, వెండి, వజ్రాలు, విలువైన రత్నాలు రూ.3,39,39,307 ఎన్నో ఉన్నాయి.

ధర్మేంద్ర వద్ద రూ.1,07,48,200 బంగారం ఉంది. ఇది కాకుండా హేమకు రూ.8,96,256, ధర్మేంద్రకు రూ.29,53,518 విలువైన ఇతర ఆస్తులు ఉన్నాయి. పుణె, జైపూర్ జిల్లాల్లో ధర్మేంద్రకు రూ.9,36,70,813 విలువైన స్థిరాస్తులు ఉన్నాయి. హేమమాలినికి ముంబైలోని NS రోడ్డులో భూమి, అంధేరీ వెస్ట్‌లో రెండు ఫ్లాట్లు, ముంబైలోని గోరేగావ్‌లో ఒక ఫ్లాట్, చెన్నైలోని కస్తూరి రంగా రోడ్డులో ఒక ఫ్లాట్, బృందావన్‌లో ఇల్లు ఉన్నాయి. కానీ ధర్మేంద్ర మొదటి భార్య కుమారుడు సన్నీ డియోల్ ప్రభుత్వ అఫిడవిట్ ప్రకారం నికర విలువ 89కోట్లు ఉన్నట్లు పేర్కొన్నారు.

Tags:    

Similar News