Jaya Prakash Reddy : ఏడాది కిందే జయప్రకాష్ రెడ్డి రిటైర్.. మళ్లీ వెనక్కి తీసుకొచ్చింది ఆయనే!
Jaya Prakash Reddy : టాలీవుడ్ లో విలక్షమైన పాత్రలు పోషిస్తూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న నటుడు జయప్రకాష్ రెడ్డి..
Jaya Prakash Reddy : టాలీవుడ్ లో విలక్షమైన పాత్రలు పోషిస్తూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న నటుడు జయప్రకాష్ రెడ్డి.. విలన్ గా ఓ వెలుగు వెలుగుతున్న టైంలో కామెడీ ఆర్టిస్ట్ గా మారి పలు సినిమాల్లో నటించారు.. ఇలా కెరీర్ పీక్స్ టైంలో ఉన్న సమయంలోనే గత ఏడాది ఆయన సినిమాల నుంచి రిటైర్ అయ్యారు. ఆయన గత ఏడాదే హైదరాబాద్ ను వదిలేసి గుంటూరు వెళ్లిపోయారు.
జయప్రకాష్ రెడ్డి కొడుకు గుంటూరులో సెటిల్ అయ్యారు.. ఆయన కుమార్తె విజయవాడలో, అల్లుడు బెజవాడలోనే అసిస్టెంట్ ఇంజనీర్ గా పనిచేస్తున్నారు.. దీనితో ఆయన హైదరాబాద్ వదిలి గుంటూరుకి వెళ్లిపోయారు.. ఇక ఆయన సినిమాలు చేయరు అన్న సంగతి కూడా ఇండస్ట్రీ లో అతికొద్ది మందికి మాత్రమే తెలుసు.. ఇది దర్శకుడు అనిల్ రావిపూడికి మహేష్ బాబుతో సరిలేరు నీకెవ్వరు సినిమా చేస్తున్న సమయంలో తెలిసింది..
అయితే అనిల్ ఫస్ట్ మూవీ నుంచి జేపీ ఏదొక క్యారెక్టర్ లో కనిపిస్తూనే ఉన్నారు.. ఆయన ఉండడం అనిల్ కి ఓ సెంటిమెంట్.. జేపీ రిటైర్ తీసుకున్న అనిల్ మాత్రం వదలలేదు.. ఆయన్ని బలవంతగా ఒప్పించి హైదరాబాద్ కి రప్పించి సినిమాలో ఓ చిన్న పాత్రను చేయించుకున్నారు.. ఈ సినిమాలో జేపీది ప్రకాష్ రాజ్ తండ్రి పాత్ర.. ఆయనకి ఉండేవి కూడా రెండే డైలాగులు.. పండబెట్టి-పీక కోసి అనే డైలాగ్ ఒకటి కాగా, కూజాలు చెంబులౌతాయి అనేది మరో డైలాగ్ .. ఈ పాత్ర ధియేటర్ లో ఎంత నవ్వించిందో అందరికి తెలిసిందే..
ఈ సినిమాలో ఆయన నటించి మళ్లీ గుంటూరు వెళ్లిపోయారు.. ఇప్పుడు ఏకంగా లోకాన్ని విడిచివెళ్లిపోయారు.. ఆయన మన మధ్య భౌతికంగా లేకున్నా సినిమాల ద్వారా పాత్రల ద్వారా ఎప్పటికి గుర్తుండి పోతారు..