HBD Sonu Sood: సోనూసూద్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు!
HBD Sonu Sood: సోనూసూద్ .. ఇప్పుడు ఎక్కడ చూసిన ఎవరి మాట విన్న ఇదే పేరు.. కష్టం, సహాయం అనే మాట వినిపిస్తే చాలు అక్కడ వాలిపోతున్నాడు.
HBD sonusood :సోనూసూద్ .. ఇప్పుడు ఎక్కడ చూసిన ఎవరి మాట విన్న ఇదే పేరు.. కష్టం, సహాయం అనే మాట వినిపిస్తే చాలు అక్కడ వాలిపోతున్నాడు.. కరోనా సమయంలో చాలా మంది వలస కూలీలను వారివారి సొంత గ్రామాలకు చేర్చిన సోనుసూద్ వారి పాలిట దేవుడు అయ్యాడు. సినిమాలో విలన్ అయినప్పటికీ రియల్ లైఫ్ లో అందరి దృష్టిలో హీరో అనిపించుకుంటున్నాడు. డబ్బులు అందరి దగ్గర ఉంటాయి. కానీ ఎదుటివారికి సహాయం చేయాలనే గుణం మాత్రం కొందరికి మాత్రమే ఉంటుందని చూపించాడు సోనుసూద్.. అలాంటి సోనుసూద్ ఈ రోజు 47 వ పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా సోనుసూద్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం..
సోనూ సూద్ పంజాబ్ లోని మోగ అనే అనే పట్టణంలో జన్మించాడు. అక్కడ నాగపూర్ లో ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ పూర్తి చేసిన సోనుసూద్ ఆ తర్వాత మోడలింగ్, ఫ్యాషన్ షో, ర్యాంప్ వాక్ చేసేవాడు. అదే సమయంలో సినిమాల్లోకి వెళ్ళాలనే కోరిక బలంగా పడిపోయింది. అనుకున్నదే పనిగా నెలరోజుల పాటు శిక్షణ తీసుకున్నాడు. అయితే సోనుసూద్ కి మొదటి అవకాశం మాత్రం తమిళ్ లో వచ్చింది. 1999 లో కుళ్ళళలగర్ అనే చిత్రంలో నటించాడు సోనుసూద్.. ఈ సినిమాలో సౌమ్య నారాయణ అనే పూజారి పాత్రలో కనిపించాడు సోనుసూద్.. బాలీవుడ్ లో నటించాలనే కోరిక మాత్రం సోనుసూద్ కి 2002 లో తీరింది. వచ్చిన షాహిద్-ఏ-ఆజం అనే హిందీ సినిమాలో భగత్ సింగ్ పాత్ర పోషించాడు సోనుసూద్..
ఇక తెలుగులో పూరి జగన్నాధ్ దర్శకత్వంలో నాగార్జున హీరోగా వచ్చిన సూపర్ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు సోనుసూద్.. ఇక సోనుసూద్ కే మెయిన్ టర్నింగ్ పాయింట్ సినిమా అరుంధతి అని చెప్పాలి. ఈ సినిమాలో పశుపతి పాత్రతో అందరిని మెప్పించాడు సోనుసూద్.. ఏకంగా ఈ సినిమాకి గాను ఉత్తమ విలన్ గా నంది అవార్డు వచ్చింది. ఇక్కడ మరో విశేషం ఏంటంటే సోనుసూద్ కి డబ్బింగ్ చెప్పిన రవిశంకర్ కూడా నంది అవార్డు లభించడం..ఇక ఆ తర్వాత రవితేజ అంజనేయులు, ప్రభాస్ ఏక్ నిరంజన్ మొదలగు చిత్రాలలో నటించాడు. సోనూసూద్ 1996 లో సోనాలిని వివాహం చేసుకున్నారు వారికి ఇద్దరు కుమారులు, ఇషాంత్ మరియు అయాన్ ఉన్నారు. ప్రస్తుతం సోనుసూద్ చిరంజీవి ఆచార్య అనే సినిమాలో ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు.