చిరంజీవి కోసం రాసిన కథను పూరి జగన్నాథ్ బాలకృష్ణతో చేశారా?

Puri Jagannadh: "ఆచార్య" సినిమాతో మర్చిపోలేని డిజాస్టర్ అందుకున్న మెగాస్టార్ చిరంజీవి ఈ మధ్యనే "గాడ్ ఫాదర్" సినిమాతో మంచి హిట్ అందుకున్నారు.

Update: 2022-10-14 16:53 GMT

చిరంజీవి కోసం రాసిన కథను పూరి జగన్నాథ్ బాలకృష్ణతో చేశారా?

Puri Jagannadh: "ఆచార్య" సినిమాతో మర్చిపోలేని డిజాస్టర్ అందుకున్న మెగాస్టార్ చిరంజీవి ఈ మధ్యనే "గాడ్ ఫాదర్" సినిమాతో మంచి హిట్ అందుకున్నారు. మలయాళం లో సూపర్ హిట్ అయిన లూసిఫర్ సినిమాకి తెలుగు రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమాలో నయనతార సత్యదేవ్ సల్మాన్ ఖాన్ సునీల్ మురళీ శర్మ తో పాటు ప్రముఖ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కూడా కీలకపాత్రలో కనిపించారు. అయితే ఈ మధ్యనే అక్టోబర్ 5 న దసరా సందర్భంగా విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది. మొదటి రోజు నుంచి పాజిటివ్ టాక్ తో మంచి కలెక్షన్లను నమోదు చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తుంది.

తాజాగా చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా చిరంజీవి మరియు పూరి జగన్నాథ్ సోషల్ మీడియాలోనే ఒక ఆన్లైన్ ఇంటర్వ్యూ ప్లాన్ చేశారు. అందులో భాగంగా మాట్లాడుతూ పూరి జగన్నాథ్ "ఆటో జానీ" కాకుండా చిరంజీవి కోసం ఒక పవర్ఫుల్ స్క్రిప్ట్ ని తయారు చేస్తానని చెప్పుకొచ్చారు. అయితే ఈ నేపథ్యంలో పూరి జగన్నాథ్ చిరంజీవి హీరోగా తీయాల్సిన "ఆటో జానీ" సినిమానే బాలకృష్ణ హీరోగా నటించిన "పైసా వసూల్" సినిమానా అని, చిరంజీవి కోసం రాసుకున్న స్క్రిప్టును పూరి జగన్నాథ్ బాలయ్యకు వాడేసారని వార్తలు వినిపిస్తున్నాయి. దీని వెనుక నిజా నిజాలు మాత్రం ఇంకా తెలియాల్సి ఉన్నాయి.

Tags:    

Similar News