HBD Puri Jagannadh : ఇట్లు.. ఇస్మార్ట్.. పూరీ!

HBD puri Jagannadh : పూరీ జగన్నాథ్.. డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్.. ఒక సినిమాని ఎప్పుడు స్టార్ట్ చేస్తాడో.. ఎప్పుడు ముగిస్తాడో.. ఎప్పుడు రిలీజ్ చేస్తాడో తెలియదు.. కొడితే సినిమా బ్లాక్ బస్టర్ అవ్వుద్ది.

Update: 2020-09-28 06:21 GMT

Puri Jagannadh

HBD puri Jagannadh : పూరీ జగన్నాథ్.. డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్.. ఒక సినిమాని ఎప్పుడు స్టార్ట్ చేస్తాడో.. ఎప్పుడు ముగిస్తాడో.. ఎప్పుడు రిలీజ్ చేస్తాడో తెలియదు.. కొడితే సినిమా బ్లాక్ బస్టర్ అవ్వుద్ది.. పూరీ అనగానే ఒకటిగా ఫాస్ట్ గా సినిమాలు తీయడం అయితే ఇంకోటి సుత్తి లేకుండా స్పష్టంగా మాట్లాడడం.. ఇవే పూరీని డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ గా నిలబెట్టాయి.. అప్పటివరకు సాఫ్ట్ టైటిల్స్ తో పోతున్నా ఇండస్ట్రీకి తిట్లతో టైటిల్స్ పెట్టి ట్రెండ్ సెట్ చేశాడు పూరి.. ఈ రోజు పూరీ జగన్నాథ్ తన 55 పుట్టిన రోజును జరుపుకుంటున్నాడు.. ఈ సందర్భంగా పూరి గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం..

1. 19966 సెప్టెంబర్ 28 న తూర్పు గోదావరి జిల్లా నర్సీపట్నంలో జన్మించాడు పూరీ జగన్నాథ్..పూరీకి ఇద్దరు తమ్ముళ్ళు ఉన్నారు.

2. చిన్నప్పటి నుంచి పుస్తకాలు చదవడం అలవాటు ఉండడంతో అలా కథలు రాయడం మొదలు పెట్టాడు.. ఆ తరవాత సినిమా పైన పిచ్చి పెరిగింది. పూరీ పైన రచయిత చలం ప్రభావం ఎక్కువగా ఉండేది.

3. 1989లో ఇండస్ట్రీకి వచ్చిన పూరీ "శివ" సినిమా చూసి మొదటగా రామ్ గోపాల్ దగ్గర శిష్యరికం చేశారు. అక్కడ దర్శకుడు కృష్ణవంశీ దగ్గర పరిచయం ఏర్పడింది.. అసిస్టెంట్ డైరెక్టర్ గా పూరీ అందుకున్న పారితోషికం రూ. 1500.. శివ, గులాబీ, నిన్నే పెళ్ళడతా, సింధూరం అనే సినిమాలకి పూరి అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశారు.

4. అసిస్టెంట్ డైరెక్టర్ గా ఉన్నప్పుడే లావణ్య అనే అమ్మాయిని ప్రేమించి ఆ తర్వాత చాలా సింపుల్ గా పెళ్లి చేసుకున్నారు పూరీ.

5. ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం కథతో పవన్ ని కలిసేందుకు ట్రై చేశాడు పూరీ.. కానీ అక్కడికి వెళ్ళాక బద్రి కథ చెప్పాడు పవన్ కూడా బాగా నచ్చిందట.. కానీ క్లైమాక్స్ చేంజ్ చేయాలనీ అన్నాడట పవన్.. కానీ మళ్ళీ అదే క్లైమాక్స్ తో పూరీ పవన్ కథని చెప్పి ఇంతకి మించిన క్లైమాక్స్ తనకి దొరకడం లేదని నేను మార్చాను అని అన్నాడట.. ఇదే పవన్ కి బాగా నచ్చి డైరెక్షన్ ఛాన్స్ ఇచ్చారట.. అలా 2000 సంవత్సరంలో పూరీ డైరెక్టర్ అయిపోయాడు..

6. అప్పటివరకు బద్రి, బాచీ, ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం లాంటి మామూలు క్లాస్ టైటిల్స్ తో వచ్చిన పూరీ 'ఇడియట్' అంటూ ఓ తిట్టు టైటిల్ తో అందమైన లవ్ స్టొరీని తీశాడు. ఈ సినిమాకి పూరీనే నిర్మాత కావడం మరో విశేషం.. కట్ చేస్తే సినిమా బ్లాక్ బస్టర్.. పూరీ టాప్ డైరెక్టర్, రవితేజకి బిగ్ బ్రేక్.. మళ్ళీ ఇదే కాంబినేషన్ తో అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి సినిమా వచ్చింది.

7. పూరీని లైఫ్ ని టర్న్ చేసిన సినిమా పోకిరి.. అప్పటివరకు ఇండస్ట్రీలో ఉన్న అన్ని రికార్డులను చెరిపేసి ట్రెండ్ సెట్ చేసింది ఈ సినిమా.. ఈ సినిమాతో మహేష్ బాబు టాప్ హీరో అయిపోయాడు..

8. ఆ తరవాత ఓ హిట్, మూడు ప్లాపులు అన్నట్టుగా పూరీ కెరీర్ సాగుతూ వచ్చింది. కానీ సినిమాలు ఫాస్ట్ గా తీయడం మాత్రం పూరీ ఆపలేదు... గత ఏడాది ఇస్మార్ట్ శంకర్ అనే సినిమాతో మళ్ళీ పుంజుకున్నాడు పూరీ..

9. అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి, నేనింతే సినిమాలకి గాను పూరీకి ఉత్తమ మాటల రచయితగా నంది అవార్డులు లభించాయి..

10. పూరీ ఎక్కువగా సంగీత దర్శకుడు చక్రీతో సినిమాలు చేశారు. హీరోలలో రవితేజతో ఎక్కువ సినిమాలు చేశారు పూరీ..

11. తన తమ్ముడు సాయిరాం శంకర్ ని హీరోగా చేశారు పూరీ.. పూరీ కొడుకు ఆకాష్ కూడా హీరోగానే కొనసాగుతున్నాడు.

పూరీ జగన్నాధ్ ఇలాగే ఫాస్ట్ గా సినిమాలు చేస్తూ ఇండస్ట్రీకి మరిన్ని హిట్లు ఇవ్వాలని కోరుకుంటూ పూరీ జగన్నాధ్ కి పుట్టిన రోజు శుభాకాంక్షలు అందజేస్తోంది HMTV

Tags:    

Similar News