Happy Birthday Pawan Kalyan : టాలీవుడ్ పవర్ స్టార్ కి పుట్టినరోజు జేజేలు!

Happy Birthday Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఇది పేరు మాత్రమే కాదు ఓ ప్రభంజనం కూడా..

Update: 2020-09-02 00:21 GMT

pawan kalyan

Happy Birthday Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఇది పేరు మాత్రమే కాదు ఓ ప్రభంజనం కూడా.. ఇండస్ట్రీలో హిట్స్, ప్లాప్ లు ఒక నటుడు స్థాయిని పెంచాలో తగ్గించాలో డిసైడ్ చేస్తాయి.. కానీ వాటితో సంబంధం లేకుండా ఎదిగిన ఏకైక స్టార్ పవన్ కళ్యాణ్.. మెగాస్టార్ తమ్ముడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి ఓ వ్యక్తి నుంచి శక్తిగా ఎదిగారు పవన్.. నేడు పవన్ కళ్యాణ్ తన 49వ పుట్టినరోజు జరుపుకుంటున్నాడు..ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ కి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..

* కొణిదెల వెంకటరావు, అంజనాదేవి దంపతులకి 1971 సెప్టెంబరు 2న బాపట్లలో జన్మించారు పవన్ కళ్యాణ్.. పవన్ కళ్యాణ్ కి ఇద్దరు అన్నలు, ఇద్దరు అక్కలు..

* పవన్ కళ్యాణ్ ని హీరోగా పరిచయం చేసేందుకు చాలా మంది దర్శకులు ముందుకు వచ్చారు.. కానీ చిరంజీవి మాత్రం ఈవివి సత్యనారాయణకి ఓటు వేశారు. అలా 1996లో అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాతో ఇండస్ట్రీలోకి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు పవన్.. ఈ సినిమాలో అక్కినేని నాగేశ్వరరావు మనవరాలు సుప్రియ హీరోయిన్ గా నటించడం విశేషం.. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది.

* గోకులంలో సీత, సుస్వాగతం చిత్రాలు నటుడిగా మంచి పేరును తీసుకువచ్చాయి.

* ఇక 1998లో వచ్చిన తొలిప్రేమ సినిమా పవన్ కళ్యాణ్ ఇమేజ్ ని అమాంతం మార్చేసింది. అప్పటివరకూ చిరంజీవి తమ్ముడిగానే చూసిన ఫ్యాన్స్ పవన్ కి ప్రత్యేకంగా అభిమానులు ఏర్పడ్డారు..

* ఇక తమ్ముడు, బద్రి, ఖుషి సినిమాలు పవన్ ని స్టార్ హీరోని చేశాయి.. ఇక్కడి నుంచి మెగాస్టార్ తమ్ముడు పవన్ కళ్యాణ్ అనే స్థాయి నుంచి పవన్ కళ్యాణ్ అన్నయ్య చిరంజీవి అనే స్థాయికి ఎదిగాడు పవన్..

* ఇక జానీ నుంచి అన్నవరం వరకు పవన్ కళ్యాణ్ సినిమాలు అయన స్థాయికి మించి ఆడలేదు.. కానీ అయనకి ఎక్కడ కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ తగ్గలేదు..

* జల్సా సినిమాతో మళ్ళీ హిట్ కొట్టిన పవన్.. ఆ తర్వాత కొమరం పులి, తీన్ మార్, పంజా చిత్రాలతో నిరాశపరిచారు.

* 2012లో వచ్చిన గబ్బర్ సింగ్ చిత్రం అప్పటివరకూ ఉన్న తెలుగు సినిమా రికార్డులను చెరిపేసింది. పవన్ కళ్యాణ్ హిట్ కొడితే ఎలా ఉంటుందో బాక్స్ ఆఫీస్ కి రుచి చూపించింది.

* త్రివిక్రమ్ డైరెక్షన్ లో వచ్చిన అత్తారింటికి దారేది మరో ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. అయితే ఈ సినిమా ముందే 90 నిముషాలు ఇంటర్నెట్ లో లీక్ అయిన పవన్ ఫ్యాన్స్ ధియేటర్ లోనే చూశారు. పైరసీని అడ్డుకున్నారు.

* గోపాల గోపాల, సర్దార్ గబ్బర్ సింగ్, కాటమరాయుడు చిత్రాలు పర్వాలేదు అనిపించగా, అజ్ఞాతవాసి చిత్రం పూర్తి డిజాస్టర్ గా నిలిచింది.

* పవన్ కళ్యాణ్ మే 1997లో నందీని అనే అమ్మాయిని మొదటి వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత ఆమెకి విడాకులు ఇచ్చి నటి రేణూ దేశాయ్ ని 2009 జనవరి 28 న వివాహం చేసుకున్నారు. వీరికి అకీరా నందన్. ఆధ్య అనే పిల్లలు ఉన్నారు. ఇక రేణూ దేశాయ్ కి విడాకులు ఇచ్చి పవన్ రష్యా నటి అన్నా లెజ్‌నేవాను 2013లో వివాహం చేసుకున్నారు. వీరికి కలిగిన సంతానం మార్క్ శంకర్ పవనోవిచ్

* 25 చిత్రాల అనంతరం పవన్ కళ్యాణ్ సినిమాలను పక్కన పెట్టి పూర్తి స్థాయి రాజకీయాల్లోకి వెళ్లారు. 2014లో అయన స్థాపించిన జనసేన పార్టీని ప్రజల్లోకి వెళ్లేందుకు పవన్ టాప్ హీరోగా ఉన్న సమయంలోనే సినిమాలను వదిలేశారు. దీనికంటే ముందు అయన అన్నయ్య చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యంతోనే పవన్ రాజకీయ జీవితం మొదలైంది..

* నవంబరు 2017 లో ఇండో-యూరపియన్ బిజినెస్ ఫోరమ్ నుండి గ్లోబల్ ఎక్సెలెన్స్ పురస్కారం అందుకొన్నాడు. నటుడిగా, రాజకీయవేత్తగా, సామాజిక సేవకుడిగా ఆయనను గుర్తించి ఈ అవార్డు ఇచ్చారు

* 2019లో జరిగిన ఎన్నికల్లో అయన భీమవరం, గాజువాకలలో పోటి చేయగా రెండింటిలోనూ ఓడిపోయారు..

* తిరిగి పవన్ కళ్యాణ్ మళ్ళీ సినిమాలను చేస్తున్నారు. అయన రీఎంట్రీ మూవీగా వకీల్ సాబ్ అనే చిత్రం తెరకెక్కుతుంది.

* హీరోగా కాకుండా ఓ మానవత్వం ఉన్న మనిషిగా చాలా మందికి సహాయం చేశారు పవన్.. కానీ వాటిని ఎక్కడ కూడా పబ్లిసిటీ చేసుకోడానికి ఇష్టపడలేదు

* ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ ఒక్క కమర్షియల్ యాడ్ లోనే నటించారు. 2001 లో, శీతల పానీయాల దిగ్గజం పెప్సీకి అయన బ్రాండ్ అంబాసిడర్‌ గా పనిచేశారు.

* కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ (CMPF) ని పవన్ కళ్యాణ్ స్థాపించారు. ఆ సమయంలో తన బ్యాంకు ఖాతాలో ఉన్న మొత్తం డబ్బును దీనికే పెట్టేశారు.

* పవన్ కళ్యాణ్ సినిమాలలో ఎక్కువ భాగం మొదటి పాటలు యూత్ ని ఉద్దేశించి లేదా సందేశాత్మకంగా ఉంటాయి.

* పవన్ కళ్యాణ్ కేవలం నటుడు మాత్రమే కాదు మంచి రచయిత, ఫైట్ మాస్టర్ కూడా.. జానీ సినిమాకి ఆయనే కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం చేశారు. సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాకి కథను అందించారు. బద్రి, జానీ, ఖుషి సినిమాలలో కొన్ని ఫైట్స్ అనే కంపోజ్ చేసుకున్నారు. అత్తారింటికి దారేది, అజ్ఞాతవాసి చిత్రాలో పాటలు కూడా పాడారు పవన్..

* చిరంజీవి నటించిన శంకర్ దాదా జిందాబాద్ చిత్రంలో పవన్ కళ్యాణ్ గెస్ట్ రోల్ చేశారు.

* పవన్ సినిమాలలో ఎక్కువగా అమ్మాయిల గురించి టీజింగ్, అమ్మాయిల గురించి అసందర్బంగా మాట్లాడడం ఉండవు.. వాటిని అయన ఎంకరేజ్ చేయరు.

* పవన్ తన 25 చిత్రాలలో ఇద్దరు దర్శకులను ఇండస్ట్రీకి పరిచయం చేశారు. వారే పూరి జగన్నాధ్, కరుణాకరన్

* చేగువేరా, గుంటూరు శేషాద్రి శర్మ లాంటి వాళ్ళ ప్రభావం పవన్ కళ్యాణ్ పైన ఎక్కువగా ఉంటుంది.  

ఇలాగే పవన్ కళ్యాణ్ సినిమాలతో ప్రేక్షకులను మెప్పించాలని కోరుకుంటూ అయనకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతుంది HMTV

Tags:    

Similar News