Happy birthday Kalyan Ram : ఎంత మొండివాడవురా!

Happy birthday kalyan ram : తెలుగు ప్రేక్షకుల ఆరాధ్య దైవం దివంగత నటుడు నందమూరి తారక రామారావు.. ఆయన వారసత్వం పుచ్చుకొని చాలామంది సినిమాలోకి ఎంట్రీ ఇచ్చారు..

Update: 2020-07-05 07:31 GMT

Happy birthday kalyan ram : తెలుగు ప్రేక్షకుల ఆరాధ్య దైవం దివంగత నటుడు నందమూరి తారక రామారావు.. ఆయన వారసత్వం పుచ్చుకొని చాలామంది సినిమాలోకి ఎంట్రీ ఇచ్చారు.. అందులో నందమూరి కళ్యాణ్ రామ్ ఒకడు.. నందమూరి వంశం నుంచి చాలా మంది హీరోలు వచ్చినప్పటికీ వారి ప్రభావం తనపైన పడకుండా చూసుకుంటూ తనకంటూ ఓ ఓన్ ఇమేజ్ ని సొంతం చేసుకున్నాడు కళ్యాణ్ రామ్.. ఈ రోజు కళ్యాణ్ రామ్ 43 వ పుట్టిన రోజు జరుపుకుంటున్నాడు. ఈ సంద్భంగా కళ్యాణ్ రామ్ కి బెస్ట్ విషెస్ అందిస్తూ కళ్యాణ్ రామ్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం..

కళ్యాణ్ రామ్ 1978 జూలై 5 నందమూరి హరక్రిష్ణ, లక్ష్మి లకు హైదరాబాద్ లో జన్మించాడు.. కళ్యాణ్ రామ్ చికాగోలో ఇంజనీరింగ్ విద్యను పూర్తి చేశాడు.

బాలకృష్ణ హీరోగా నటించిన బాలగోపాలుడు సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించాడు. ఇందులో రాశి కూడా మరో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించింది.

ఆ తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న కళ్యాణ్ రామ్ 2003లో వచ్చిన 'తొలిచూపులొనే' అనే సినిమాతో పూర్తి స్థాయి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. అయితే ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అనుకున్నంత విజయాన్ని అందుకోలేకపోయింది. ఇక అదే ఏడాది చేసిన అభిమన్యు కూడా ఆకట్టుకోలేకపోయింది.

ఈ సమయంలో తానే నిర్మాతగా మారాలని అనుకోని ఎన్టీఆర్ ఆర్ట్స్ అనే బ్యానర్ ని స్థాపించి సురేందర్ రెడ్డి అనే కొత్త దర్శకుడిని ఇండస్ట్రీకి పరిచయం చేస్తూ అతనొక్కడే అనే సినిమాని ఎక్కడ కూడా రాజీపడకుండా తెరకెక్కించాడు కళ్యాణ్ రామ్.. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. కళ్యాణ్ రామ్ స్టామినా అందరికి అర్ధం అయింది.

ఈ సినిమా సక్సెస్ తో కళ్యాణ్ రామ్ వరుసపెట్టి సినిమాలు చేశాడు.. కానీ ఏవి కూడా అతనొక్కడే సినిమా స్థాయిలాగా మెప్పించలేకపోయాయి.. తేజ దర్శకత్వంలో వచ్చిన లక్ష్మీ కల్యాణం పర్వాలేదు అనిపించింది..

ఎన్ని ప్లాప్స్ వచ్చిన తాను మాత్రం మొండిగా సినిమాలు చేసుకుంటూ వెళ్ళిపోయాడు.. 'ఓం 3D' అనే సినిమాని 3D లో తెరకెక్కించి అందరిని ఆశ్చర్యపరిచాడు.. కానీ ఈ సినిమా కూడా కళ్యాణ్ రామ్ కి అనుకున్న సక్సెస్ ని ఇవ్వలేదు..

ఇక 2015లో అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన 'పటాస్‌'తో మంచి విజయాన్ని అందుకున్నారు కళ్యాణ్ రామ్. పోలీస్‌ ఆఫీసర్‌గా ఆయన నటన అందరిని ఆకట్టుకుంది. పెట్టిన బడ్జెట్ కి మూడు రేట్ల లాభాలను తీసుకువచ్చింది ఈ సినిమా.. దాదాపుగా పదేళ్ల తర్వాత కళ్యాణ్ రామ్ కి గ్రాండ్ విక్టరీ కొట్టాడు..

ఈ సినిమా తర్వాత కళ్యాణ్ రామ్ ని మళ్లీ అపజయాలు వెంటాడాయి. 'ఇజం', 'ఎంఎల్‌ఏ', 'నా నువ్వే' 'ఎంత మంచి వాడవురా' చిత్రాలు మెప్పించలేకపోయాయి. కానీ తన బాబాయ్ బాలక్రిష్ణ నటించిన ఎన్టీఆర్ బయోపిక్ లో కళ్యాణ్ రామ్ తన తండ్రి హరిక్రిష్ణ పాత్రలో కనిపించి మెప్పించాడు.. సినిమా ఫలితం ఎలా ఉన్న కళ్యాణ్ రామ్ కి ఇది ఓ స్పెషల్ రోల్..

కళ్యాణ్ రామ్ ఎన్టీఆర్ తో జై లవ కుశ , రవితేజతో కిక్ 2 సినిమాలను నిర్మించాడు.

రాజకీయాలకు, కాంట్రవర్సీలకు దూరంగా ఉంటూ వస్తున్నాడు..

కళ్యాణ్ రామ్ కి స్వాతి అనే అమ్మాయితో 2006 లో పెళ్లి అయింది. వీరికి శౌర్య రామ్,తారక అద్వతి ఇద్దరు పిల్లలు ఉన్నారు..

ప్రస్తుతం కళ్యాణ్ రామ్ ఎన్టీఆర్ 30 వ సినిమాని నిర్మిస్తున్నాడు. అటు వీఐ ఆనంద్ దర్శకత్వంలో హీరోగా ఓ సినిమా చేస్తున్నాడు. 

Tags:    

Similar News