Happy Birthday Devi Sri Prasad : టాలీవుడ్ రాక్ స్టార్ కి బర్త్ డే విషెస్!

Happy Birthday Devi Sri Prasad : 19 ఏళ్ల వయసులోనే సంగీత ప్రపంచంలోకి అడుగుపెట్టి తన మ్యూజిక్ తో మెస్మరైస్ చేసాడు.

Update: 2020-08-02 05:29 GMT
Devi sri prasad (File photo)

Happy Birthday Devi Sri Prasad : 19 ఏళ్ల వయసులోనే సంగీత ప్రపంచంలోకి అడుగుపెట్టి తన మ్యూజిక్ తో మెస్మరైస్ చేసాడు. యూత్ ని తన మ్యూజిక్ తో కట్టిపడేశాడు. సినిమాకి అతను సంగీత దర్శకుడు అయితే చాలు సినిమా సగం హిట్టే అనే భరోసాని కలిపించాడు. కనిపించే మ్యూజిషన్ అయిన అతనో మేజిషన్.. అతడే టాలీవుడ్ రాక్ స్టార్ దేవి శ్రీ ప్రాసాద్.. ఈ రోజు దేవి 41వ పుట్టిన రోజును జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా దేవి గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..

* 1979 ఆగస్టు 2న సత్యమూర్తి,శిరోమణి దంపతులకి జన్మించాడు దేవి శ్రీ ప్రసాద్..

* దేవిశ్రీకి చిన్నప్పటి నుంచి సంగీతమంటే ఆసక్తి. అందుకనే అప్పటి నుండే సంగీత దర్శకుడు కావాలని కలలు కనేవాడు.. దేవి తండ్రి సత్యమూర్తి కూడా సినిమాలో రచయిత కావడంతో దేవిని ఎంకరేజ్ చేశారు.

* దేవి ముందుగా మాండొలిన్ శ్రీనివాస్ దగ్గర మాండొలిన్ నేర్చుకున్నారు. ఆ తరవాత ఇండస్ట్రీలో మణిశర్మ దగ్గర శిష్యరికం చేశారు.

* ముందుగా దేవి టాలెంట్ ని గుర్తించింది మాత్రం దర్శకుడు కోడి రామకృష్ణ అనే చెప్పాలి. దేవి లాంటి సినిమాకి దేవి శ్రీ ప్రసాద్ ని సంగీత దర్శకుడిగా ఎంచుకొని అతన్ని ఇండస్ట్రీకి పరిచయం చేశారు.

* ఈ సినిమా చేస్తున్నప్పుడు దేవి శ్రీ ప్రసాద్ వయసు కేవలం 19 సంవత్సరాలు మాత్రమే.. పిన్నవయసులోనే సంగీత దర్శకత్వం చేపట్టిన వారిలో యువన్ శంకర్ రాజా మొదటి వాడు కాగా (18 ఏళ్ళు) దేవి శ్రీ రెండవవాడు.

* మొదటి సినిమాతోనే జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు లాంటి సీనియర్ తో పనిచేశాడు దేవి.. ఈ సినిమాకి జొన్నవిత్తుల సింగిల్ కార్డు

* ఈ సినిమా తర్వాత దేవికి ఆనందం సినిమా మంచి బ్రేక్ ఇచ్చింది. ఇందులో అన్ని పాటలు ఎప్పటికి ఎవర్ గ్రీన్ అనే చెప్పాలి.

* ఇక దేవికి ఛాన్స్ ఇచ్చిన స్టార్ హీరో నాగార్జుననే .. మన్మథుడు సినిమాతో దేవికి ఆ ఛాన్స్ వచ్చింది. మరో విశేషం ఏంటంటే తన 50 వ సినిమాని కూడా నాగార్జున తోనే చేశారు దేవి.. అదే డమరుకం..

* ఇక ఆ తర్వాత వర్షం, వెంకీ, ఆర్య, శంకర్ దాదా ఎంబిబిఎస్, భద్ర, బొమ్మరిల్లు చిత్రాలలో దేవి పాటలు మారుమ్రోగాయి.

* దీనితో శ్రీనువైట్ల, బోయపాటి శ్రీను, త్రివిక్రమ్ శ్రీనివాస్, సుకుమార్ లాంటి దర్శకులకు దేవి ఆస్థాన సంగీత దర్శకుడిగా నిలిచారు.

* మెగా ఫ్యామిలీలో ప్రతి ఒక్క హీరోతో పనిచేశారు దేవి.. (ఒక్క కళ్యాణ్ దేవ్ తో తప్ప)

* దేవికి వర్షం, నువ్వొస్తానంటే నేనొద్దంటానా, బొమ్మరిల్లు చిత్రాలకి గాను ఫిల్మ్‌ఫేర్ పురస్కారం లభించింది.

* అత్తారింటికి దారేది సినిమాకి గాను నంది అవార్డు లభించింది.

* మ్యూజిక్ డైరెక్టర్ గానే కాకుండా గేయ రచయితగా కూడా పలు పాటలు రాశారు దేవిశ్రీప్రసాద్..

* అటు ఐటమ్ సాంగ్ లకి పెట్టింది పెరుగా దేవి.. కొట్టిన ప్రతి ఐటమ్ సాంగ్ బ్లాక్ బస్టర్ హిట్టే..

* దేవికి నాన్నకు ప్రేమతో సినిమా చాలా స్పెషల్.. తన తండ్రి పై ఉన్న ప్రేమతో నాన్నకు ప్రేమతో అంటూ పాటను రాసి మరి పాడాడు దేవి.. ఈ సినిమా సమయంలోనే ఆయన తండ్రి సత్యమూర్తి మరణించారు.

* ప్రస్తుతం దేవి ఉప్పెన, రంగ్ దే, పుష్ప సినిమాలతో బిజి గా ఉన్నాడు.

ఇక దేవి ఇలాగే మరిన్ని బర్త్ డేస్ జరుపుకోవాలని, ప్రేక్షకులకి ఇలాగే మరిన్ని గొప్ప పాటలను అందించాలని కోరుకుంటూ దేవికి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతుంది HMTV..  

Tags:    

Similar News