రెండు విభిన్న కాన్సెప్ట్లతో హను రాఘవపూడి
*రెండు విభిన్న కాన్సెప్ట్లతో హను రాఘవపూడి
Hanu Raghavapudi: "అందాల రాక్షసి" సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి దర్శకుడిగా పరిచయమయ్యారు హను రాఘవపూడి. మొదటి సినిమాతోనే సూపర్ హిట్ ని అందుకున్న హను ఈ సినిమా తరువాత "కృష్ణ గాడి వీర ప్రేమ గాధ" సినిమాతో మరొక సారి ప్రేక్షకులను అలరించారు. ఆ తర్వాత విడుదలైన "పడి పడి లేచే మనసు" మాత్రం బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది. తాజాగా ఇప్పుడు హను రాఘవపూడి "సీతారామం" అనే సినిమాతో ప్రేక్షకులు ముందుకు రాబోతున్నారు.
ఇది కూడా ఒక ప్రేమ కథ. ఈ సినిమా తర్వాత ఒక రెండు కొత్త ప్రాజెక్టులను కూడా ఓకే చేశారు హను రాఘవపూడి. తాజాగా ఇప్పుడు హిందీలో ఒక సినిమా చేయబోతున్నారు. అంతే కాకుండా అమెజాన్ ప్రైమ్ వీడియో కోసం ఒక వెబ్ సిరీస్ చేయడానికి కూడా సిద్ధమయ్యారు హను.ఈ రెండు విభిన్న కాన్సెప్ట్ ఉన్న కథలని తెలుస్తోంది. "సీతారామం" సినిమా ఎంత పెద్ద హిట్ అయినప్పటికీ ఈ రెండు ప్రాజెక్టులు పూర్తి చేసి తెలుగులో మళ్లీ ఇంకొక సినిమా చేయాలంటే కనీసం రెండేళ్లయినా పడుతుంది.
"నాకు కొన్ని ఫ్లాప్ లు రావడంతో గ్యాప్ పెరిగింది. ఇండస్ట్రీలో ఎంత టాలెంట్ ఉన్నా కేవలం హిట్టు లేదా ఫ్లాప్ ల తోనే మన ప్రతిభను అంచనా వేస్తుంటారు" అని అన్నారు హను. అయితే "సీతారామం" సినిమాతో మాత్రం కచ్చితంగా డైరెక్టర్ గా తాను మంచి కమ్ బ్యాక్ ఇవ్వబోతున్నట్లు తెలిపారు హను. దుల్కర్ సల్మాన్ సరసన మృణాల్ ఠాకూర్ ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది. రష్మిక కూడా ఈ సినిమాలో ఒక కీలక పాత్రలో కనిపించనుంది. వైజయంతి మూవీస్ వారు నిర్మిస్తున్న ఈ సినిమా ఆగస్టు 5న థియేటర్లలో విడుదల కాబోతోంది.