Prabhas: ప్రభాస్ తో హనురాఘవపూడీ తీసే సినిమా కథ అదేనా?
Prabhas: రెబల్ స్టార్ ప్రభాస్ కల్కీ పెండింగ్ షూటింగ్ ని పూర్తిచేసేందుకు ఫిల్మ్ టీం రెడీ అయ్యింది.
Prabhas: రెబల్ స్టార్ ప్రభాస్ కల్కీ పెండింగ్ షూటింగ్ ని పూర్తిచేసేందుకు ఫిల్మ్ టీం రెడీ అయ్యింది. తర్వాత మారుతి మేకింగ్ లో రాజా సాబ్ పూర్తవుతుంది. ఆ తర్వతేంటంటే స్పిరిట్ అంటున్నారు. కాని అంతకంటే ముందే సీతారామం ఫేం హనురాఘవ పూడీ ప్రాజెక్ట్ పట్టాలెక్కనుంది. ఐతే ఇది మరో సీతారామం మాత్రం కాదని తెలుస్తోంది. ఇంతకీ ఈ సినిమా జోనరేంటి?
ప్రభాస్ కల్కీ పెండింగ్ షూటింగ్ పూర్తిచేసే పనిలో ఉన్నాడు. కమల్, అమితాబ్, దీపికా, దిశా పటాని,తోపాటు గెస్ట్ గా కనిపించబోయే విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్ తో కలిసి షూటింగ్ లో జాయిన్ అయ్యాడు. అయితే తను కొత్తగా ఎంచుకుంటున్న జోనర్ల మీదే రకరకాల చర్చలు మొదలయ్యాయి. కల్కీ మూవీని పూర్తి చేసి మారుతి తీస్తున్న ది రాజాసాబ్ షూటింగ్ కి రెడీ అవటమే రెబల్ స్టార్ ముందున్న ప్లాన్... ఆతర్వాత ఏంట చేస్తాడంటే సీతారామం ఫేం హనురాఘవపూడీ మేకింగ్ లో సినిమా సెట్స్ పైకెళ్లోబోతోంది. ప్రభాస్ రేంజ్ కి తగ్గ లవ్ స్టోరీనే అనగానే, ఇది మరో సీతారామమా అన్న అనుమానాలు పెరిగాయి.
సీతారామం హిట్టైంది. పాన్ ఇండియా లెవల్లో హనురాఘవపూడీకి క్లాసిక్ హిట్ ఇచ్చిన దర్శకుడిగా పేరొచ్చింది. ఐతే తను ప్రభాస్ తో వరల్డ్ వార్ 2 బ్యాక్ డ్రాప్ లో ఓ లవ్ స్టోరీ తెరకె్కించబోతున్నాడట. అంటే ఇది రాధేశ్యామ్ లా ఓ మామూలు ప్రేమకథని, పాన్ ఇండియా మూవీగా మార్చే ప్రయత్నమా అన్న అనుమానాలు, కామెంట్ల రూపంలో పేలుతున్నాయి.
నిజానికి కల్కీ, రాజా సాబ్ పూర్తయ్యాక సెట్స్ పైకెళ్లాల్సిన మూవీ స్పిరిట్. సందీప్ రెడ్డి వంగ కాస్త టైం తీసుకుంటుండటంతో, తనకంటే ముందు హనురాఘవ పూడీ మేకింగ్ లో ప్రాజెక్ట్ పట్టాలెక్కేలా ఉంది. కాకపోతే రాధేవ్యామ్, సాహో లాంటి ప్రయోగాలు చేసి చేతులు కాల్చుకున్న ప్రభాస్ కి కలిసొచ్చే మాస్, యాక్షన్ జోనరే బెటర్ అంటున్నారు. మళ్లి ఇలా ప్రేమకథలంటే కష్టకాలం షాక్ ఇస్తుందన్న మాటలు వినిపిస్తున్నాయి.
సలార్ మూవీ యాక్షన్ డ్రామానే అయినా తల్లి, ప్రెండ్ సెంటిమెంట్ కలిసొచ్చింది. అలానే హను రాఘవపూడీ వరల్డ్ వార్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కించే ప్రేమకథ కూడా, సలార్ లానే ఎంత కదిలించే కంటెంట్ ఉన్నా, యాక్షన్ సీక్వెన్స్ కి, మాస్ మతిపోగొట్టే సీన్లకి కొదువ లేకుండా స్క్రీప్ రెడీ చేసుకున్నాడట హనురాఘవపూడీ. స్క్రిప్ట్ వర్క్ అంత పక్కాగా ఉంది కాబట్టే, స్పిరిట్ కంటే ముందే ఈ ప్రాజెక్ట్ ని పట్టాలెక్కించే ప్రయత్నాలు జరుగుతున్నాయట.