శ్రీశాంత్ పక్కన ఫేడవుట్ హీరోయిన్... ?

Update: 2019-10-11 16:01 GMT

అల్లు అర్జున్ , పూరి జగన్నాధ్ కాంబినేషన్ లో వచ్చిన దేశముదురు సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయ్యింది నటి హన్సిక మోత్వానీ .. టాప్ హీరోయిన్ అయ్యే అన్ని లక్షణాలు ఉన్నప్పటికీ ఆమె చేసిన సినిమాలు ఆమెను ఆ స్టేజ్ వరకు తీసుకువెళ్ళలేకపోయాయి. తమిళ్ లో ప్రస్తుతం సినిమాలు చేసుకుంటుంది హన్సిక .. అయితే తాజా సమాచారం ప్రకారం క్రికెటర్ శ్రీశాంత్ పక్కన హీరోయిన్ గా నటించేందుకు హన్సికకి అవకాశం వచ్చినట్టు సమాచారం.. శంకర్- హరీష్ నారాయణ్ ద్వయం ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా.. రంగనాథన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హారర్ కామెడీ నేపధ్యంలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. డిసెంబర్ లో ఈ సినిమా పట్టలేక్కనుంది. ఇప్పటికే అక్షర్ 2 `అనే హిందీ చిత్రంలో.. టీమ్ 5 అనే మలయాళ చిత్రంలో శ్రీశాంత్ నటించాడు...  

Tags:    

Similar News