Hansika Motwani: నా భర్త విడాకులకు నేను కారణం కాదు..
Hansika Motwani: విడాకుల కి తనకి సంబంధం లేదని అంటున్న హన్సిక
Hansika Motwani: ప్రముఖ నటి హన్సిక మోత్వానీ ఈ మధ్యనే సోహెల్ కతూరియా అనే వ్యక్తిని ఎప్పటినుంచో ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఎప్పటినుంచో ప్రేమించుకుంటున్న ఈ ఇద్దరు ఈ మధ్యనే పెళ్లి బంధంతో ఒకటి అయ్యారు. సోహెల్ హన్సిక బెస్ట్ ఫ్రెండ్ వాళ్ళ భర్త కానీ కొన్ని కారణాలవల్ల సోహెల్ మొదటి భార్యతో విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత హన్సిక మరియు సోహెల్ ల స్నేహం ప్రేమగా మారింది. తాజాగా వీరి పెళ్లి తతంగం "లవ్ షాది" అనే వెబ్ సిరీస్ లాగా విడుదలైంది.
అయితే సోహెల్ మొదటి పెళ్ళికి కూడా హన్సిక వెళ్ళిందని అసలు సోహెల్ తన మొదటి భార్యతో విడిపోవడానికి కారణం కూడా హన్సికానే అని గత కొద్ది రోజులుగా పుకార్లు వినిపిస్తున్నాయి. తాజాగా ఈ పుకార్లపై రియాక్ట్ అవుతూ హన్సిక.. సోహెల్ విడాకులకి తనకి ఎటువంటి సంబంధం లేదని చెప్పుకొచ్చింది. పెళ్లి సమయంలో వారి మధ్య పరిచయం ఉన్న మాట నిజమే కానీ దానికి తన విడాకులకి ఏమాత్రం సంబంధం లేదని క్లారిటీ ఇచ్చింది. "కొంతమందికి నన్ను విలన్ గా చేసేయటం చాలా ఈజీ.
నేను ఒక సెలబ్రిటీని కాబట్టి ఇలాంటివి జరగటం సహజం," అని అంటుంది హన్సిక. సోహెల్ కూడా తన మొదటి వివాహం 2014లో జరిగిందని కానీ కొద్దికాలం తర్వాతే తాము విడాకులు తీసుకున్నామని అంతకు ముందు నుంచి హన్సిక స్నేహితురాలు కాబట్టే పెళ్లికి వచ్చిందని కానీ పుకార్లలో ఏమాత్రం నిజం లేదని అన్నారు. ఇక లవ్ షాది మొదటి ఎపిసోడ్ లోనే హన్సిక ఈ విషయాలను తెలియజేసింది. విరి పెళ్లి కథ కి సంబంధించిన ఎపిసోడ్ లు హాట్ స్టార్ లో ప్రతి శుక్రవారం విడుదలవుతూ ఉంటాయి.