గుణశేఖర్ సూపర్ ప్లాన్..మరో చరిత్రాత్మక మూవీ..ఆ స్టార్ హీరో ఫిక్స్?
Gunasekhar: అప్పుడేపుడో అనుష్క కథానాయకగా వచ్చిన రుద్రమదేవి తర్వాత గుణశేఖర్ మళ్లీ మోగాఫోన్ చేతపట్టలేదు.
Gunasekhar: అప్పుడేపుడో అనుష్క కథానాయకగా వచ్చిన రుద్రమదేవి తర్వాత గుణశేఖర్ మళ్లీ మోగాఫోన్ చేతపట్టలేదు. ఆ సినిమా తీసిన గుణశేఖర్ చానాల్ల వరకు స్థబ్దుగా ఉన్నాడు. రుద్రమదేవి సినిమాకు నిర్మాతగా చేసిన గుణశేఖర్ .. పన్నూ వినహాయింపు ఇవ్వాలని మోరపెట్టుకున్నారు. అప్పటి ప్రభుత్వం గుణశేఖర్ విజ్ఞప్తులను పెద్ద పట్టించుకోదు. ఈ సినిమా పర్వాలేదనిపించిన నిర్మాతకు పెద్దగా లాభాలు తెచ్చిపెట్టలేదని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ నడిచింది. అవన్ని పక్కన పెడితే. రుద్రమదేవి మనవడు ప్రతాపరుద్రుడి చరిత్ర ఆధారంగా సినిమా తీస్తామని అప్పుడే ప్రకటించారు గుణశేఖర్.
గుణశేఖర్ సుదీర్ఘ రుద్రమదేవి తర్వాత విరామం తీసుకున్న సంగతి తెలిసిందే. ఇటీవల కొన్నేళ్లుగా హిరణ్య కశిప చిత్రంపై దృష్టి సారించారు.కరోనా మహమ్మారీ చాలా ప్రణాళికలకు బ్రేక్ వేసింది. రానా కథానాయకుడిగా సురేష్ బాబు కాంపౌండ్ తో కలిసి స్వీయదర్శకత్వంలో ఈ సినిమాని తెరకెక్కించాల్సి ఉండగా ఎందుకనో వీలుపడలేదు. హిరణ్యకశిప ప్యాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కించాల్సి ఉంటుంది. ఇది ఆలస్యం అయ్యేలా ఉంది.
ఈ లాక్ డౌన్ సమయంలో గుణశేఖర్ పూర్తిగా శాకుంతలం కథపై దృష్టి సారించి ఆ సినిమాని పట్టాలెక్కించిన సంగతి తెలిసిందే. సమంత కథానాయికగా ఇప్పటికే 50శాతం చిత్రీకరణ పూర్తి చేసేశారట. కరోనా శాంతించగానే మిగతా భాగం తెరకెక్కిస్తారు. ఇక శాకుంతలం తర్వాత గుణ భారీ ప్లానింగ్స్ తో ఉన్నారు. రుద్రమదేవి మనవడు (కూతురు కొడుకు) ప్రతాపరుద్రుడి విరోచిత పోరాటాల కథతో సీక్వెల్ ని తీసేందుకు ప్లాన్ చేస్తున్నారట. ఇప్పటికే సంతృప్తికరంగా స్క్రిప్టును కూడా రెడీ చేసి సిద్ధంగా ఉన్నానని తెలిపారు. ఇన్నాళ్టికి ఈ లాక్ డౌన్ లో ప్రతాపరుద్రుడి స్క్రిప్టును పూర్తి స్థాయిలో రెడీ చేసుకున్నారట.ఇక ప్రతాపరుద్ర కథలో హీరోగా అల్లుఅర్జున్ ను ఎంపిక చేసినట్లు సమాచారం. అల్లుఅర్జున్ కూడా స్ర్కిప్టుకు ఓకే చెప్పడంతో సినిమాను అధికారికంగా ఎనౌన్స్ చేస్తారని తెలుస్తోంది.
అలాగే తనని గోనగన్నారెడ్డి పై సినిమా తీయాలని పలువురు ఒత్తిడి తెచ్చినా కానీ ఆ పాత్ర పరిధి పరిమితం కావడంతో తీయలేనని తెలిపారట. అనవసర కల్పితాలతో హిస్టరీని వక్రించే ఆలోచన లేదని తేల్చి చెప్పేశారట. ప్రతాపరుద్రుడు చిత్రాన్ని బహుశా రుద్రమదేవికి సీక్వెల్ గా స్టార్ట్ చేసే వీలుంది.