యుద్ధానికి వెళ్లకపోవడమే మంచిది.. రజనీకి గృహలక్ష్మీ సపోర్ట్
కోట్లు పోగొట్టుకోవడం కంటే.. మెదడు పడే ఆవేదన చాలా పెద్దది. భయపడే వారు వలన బాధపడేవారు ఉంటే యుద్ధానికి వెళ్లకపోవడమే మంచిదని ఆమె అన్నారు.
రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తారని..పాతికేళ్ళుగా ఆయన అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఏదో ఒక కారణంతో ఎప్పటికప్పుడు..రాజకీయ అరంగేట్రం వాయిదా పడుతూ వస్తోంది. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పటికీ రాజకీయాల్లోకి రావడం కుదరదన్న రజనీకాంత్ అన్నంత పనీ చేశారు. ఆరోగ్యం ఏమాత్రం సహకరించడంలేదని..కుటుంబ సభ్యులు, వైద్యుల సలహా, సూచనల మేరకే రాజకీయాల్లోకి రాలేకపోతున్నట్లు తెలిపారు. మూడేళ్ళుగా పార్టీ కోసం ఎంతో శ్రమిస్తున్న మక్కల్ మండ్రం కార్యకర్తలు తనను క్షమించాలని కోరారు. వ్యాధి నిరోధక శక్తి బాగా తగ్గిపోయినందున..రాజకీయాల్లోకి వెళ్ళవద్దని..బయట తిరిగితే ఎండ, దుమ్ము వల్ల ఆరోగ్యం క్షీణించిపోతుందని డాక్టర్లు గట్టిగా సూచించినట్లు అక్టోబర్‌లోనే రజనీ తెలిపారు.
రజనీ పొలిటికల్ వార్తలపై చాలా మంది ప్రముఖులు స్పందిస్తున్నారు. కాగా.. కమల్‌హాసన్ కూడా తన స్నేహితుడి ప్రకటనతో విచారం వ్యక్తం చేశారు. రజనీ రాజకీయాల్లోకి వస్తే కలిసి పనిచేయవచ్చని కమల్ భావించారు. కాని రజనీకాంత్ ఆరోగ్యం కూడా తనకు ముఖ్యమని ప్రకటించారాయన. ఈ నేపథ్యంలో గృహలక్ష్మి సీరియల్ నటి కస్తూరి రజనీ నిర్ణయంపై ఓ ట్వీట్ చేశారు. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే ఈ నటి కస్తూరి రజనీకాంత్ తీసుకున్ననిర్ణయాన్ని స్వాగతించారు.
రజనీకాంత్ నిర్ణయాన్నితాను స్వాగతిస్తున్నట్లు చెప్పారు. మంచి ఆరోగ్యంతో సంతోషంగా జీవించాలని కోరుకుంటున్నా అని ట్వీట్ పెట్టారు. ఇది ఊహించినదే. ఇప్పుడు కాదు ఇంకెప్పుడు అని ట్వీట్ చేశారు. ఈ విషయం నేను ముందుగానే గ్రహించాను. ఈ విషయం రజనీకాంత్ ముందే చెప్పి ఉంటే కొన్ని సంవత్సరాలుగా ఎంతోమంది బాధ తొలిగిపోయేది. మొత్తానికి ఆయన ఇప్పుడు చెప్పేశారు. కోట్లు పోగొట్టుకోవడం కంటే.. మెదడు పడే ఆవేదన చాలా పెద్దది. భయపడే వారు వలన బాధపడేవారు ఉంటే యుద్ధానికి వెళ్లకపోవడమే మంచిదని ఆమె అన్నారు.