"రంగస్థలం" విషయంలో గీత ఆర్ట్స్ అలా చేసి ఉంటే బాగుండేదా?

"రంగస్థలం" విషయంలో గీత ఆర్ట్స్ అలా చేసి ఉంటే బాగుండేదా?

Update: 2022-10-17 14:48 GMT

"రంగస్థలం" విషయంలో గీత ఆర్ట్స్ అలా చేసి ఉంటే బాగుండేదా?

Geetha Arts: కన్నడ హీరో రిషబ్ శెట్టి నటించిన "కాంతారా" సినిమా ఈ మధ్యనే విడుదలై బాక్సాఫీస్ వద్ద మంచి హిట్ గా నిలిచింది. కన్నడలో మాత్రమే కాక తెలుగులో కూడా ఈ సినిమా మంచి పాజిటివ్ రెస్పాన్స్ తో ముందుకు దూసుకుపోతోంది. అయితే సినిమా చూసిన కొందరు మాత్రం ఈ సినిమాకి మరియు రామ్ చరణ్ హీరోగా నటించిన "రంగస్థలం" సినిమాకి కొన్ని పోలికలు ఉన్నాయి అని చెప్పుకొస్తున్నారు.

ఈ నేపథ్యంలో ఒకవేళ "పుష్ప" సినిమా లాగా "రంగస్థలం" సినిమా కూడా ప్యాన్ ఇండియన్ సినిమా గా మార్చి ఉంటే మరింత రీచ్ దొరికేదని బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ అయ్యేది అని కొందరు చెబుతున్నారు. అందులో నిజం లేకపోలేదు."రంగస్థలం" మరియు "కాంతారా" సినిమాలో చాలావరకు పాత్రలు కూడా ఒకేలాగా ఉంటాయి. ముఖ్యంగా అచ్యుత్ కుమార్ పాత్ర రంగస్థలంలో ప్రకాష్ రాజ్ పాత్ర రాగానే అనిపిస్తుంది.

హీరో శివ వాళ్ళ అన్నయ్య ని ఆ గ్రామ పెద్ద దేవేంద్ర చంపేస్తాడు. ఈ నిజం తెలుసుకున్న శివ ఆ గ్రామ పెద్దని ఎలా చంపేస్తాడు అనేదే సినిమా కథ. అయితే గ్రామ దేవత మరియు పూజలు మాత్రమే ఈ రెండు సినిమాలకి మధ్య ఉన్న వ్యత్యాసాలు. మరోవైపు రెండు సినిమాలలోనూ స్క్రీన్ ప్లే చాలా గ్రిప్టింగా, క్యారెక్టర్లు స్ట్రాంగ్ గా ఉంటాయి. ఈ నేపథ్యంలో గీత ఆర్ట్స్ వారు సినిమాను ప్యాన్ ఇండియన్ సినిమా గా విడుదల చేయకుండా పెద్ద తప్పే చేసిందని కొందరు చెబుతున్నారు.

Tags:    

Similar News