Bigg Boss 7 Telugu: బిగ్‌బాస్ హౌస్‌లో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునేది ఎవరో తెలుసా? అన్ని సీజన్లతో పోల్చితే చాలా తక్కువే..!
Bigg Boss 7 Telugu: బిగ్‌బాస్ సీజన్ 7 రియాలిటీ షో ఘనంగా మొదలైంది. హౌజ్‌లోకి అడుగపెట్టిన మొత్తం 14 మంది కంటెస్టెంట్లతో ఫుల్ హంగామా మొదలైంది. తొలిరోజు నుంచే బిగ్ బాస్ హౌస్‌లో రచ్చ మొదలెట్టేశారు.
Bigg Boss 7 Telugu: బిగ్‌బాస్ సీజన్ 7 రియాలిటీ షో ఘనంగా మొదలైంది. హౌజ్‌లోకి అడుగపెట్టిన మొత్తం 14 మంది కంటెస్టెంట్లతో ఫుల్ హంగామా మొదలైంది. తొలిరోజు నుంచే బిగ్ బాస్ హౌస్‌లో రచ్చ మొదలెట్టేశారు. తొలిరోజే నామినేషన్స్‌తో బిగ్ బాస్ కంటెస్టెంట్ల మధ్య చిచ్చు పెట్టేశాడు. ఈ క్రమంలో ఒకరిపై ఒకరు అరుచుకోవగడం, తిట్టుకోవడం, లవ్ ట్రాక్‌లు మొదలెట్టేశారు. ‘ఉల్టాపుల్టా’ అంటూ ఈ సీజన్‌పై ఎంతో హైప్ క్రియోట్ చేసిన నాగర్జున.. టాప్-5 కంటెస్టెంట్ ఎంట్రీ ఇవ్వగానే బ్రీఫ్ కేస్ ఆఫర్‌తో గొడవలు మొదలుపెట్టాడు. ఈ ఆఫర్‌ను తిరస్కరించిన కంటెస్టెంట్లు బిగ్ బాస్ టైటిల్‌తోనే బయటకు వెళ్తామంటూ మాటిచ్చారు. కాగా, వీకెండ్‌లో మరికొంతమంది హౌస్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్నారని అంటున్నారు. అయితే, ఇదిలా ఉంటే 7వ సీజన్ కంటెస్టెంట్లకు రెమ్యునరేషన్లపై సోషల్ మీడియాలో విపరీతమైన చర్చలు నడుస్తున్నాయి.
అత్యధిక పారితోషకం తీసుకునే వారిలో టాప్ ఎవరంటూ చర్చలు నడుతున్నాయి. అలాగే తక్కువ రెమ్యునరేషన్ ఎవరు తీసుకుంటున్నారంటూ మాట్లాడుకుంటున్నారు. కాగా, గత సీజన్లతో పోల్చితే ఈసారి చాలా తక్కువ మొత్తంలో రెమ్యునరేషన్ ఇస్తున్నారని అంటున్నారు.
బిగ్ బాస్ 7వ సీజన్‌లో అత్యధిక పారితోషకం అందుకుంటున్న వారిలో సీనియర్ నటుడు శివాజీ అగ్రస్థానంలో నిలిచాడు. అందరికంటే అత్యధికంగా వారానికి రూ. 4 లక్షలు అందుకుంటున్నారు.
అలాగే సీనియర్ నటి షకీలా ప్రతీ వారానికి రూ. 3.5 లక్షలు అందుకుంటుంది. అలాగే కిరణ్ రాథోడ్ ప్రతీ వారానికి రూ. 3 లక్షలు తీసుకుంటుంది.
ఏడో సీజన్‌లో అత్యధిక పారితోషకం అందుకుంటున్న వారిలో కొరియోగ్రాఫర్ ఆట సందీప్ ఒకరిగా నిలిచాడు. వారానికి రూ.2.75 లక్షల పారితోషం అందుకుంటున్నారు. జానకికలగనలేదు సీరియల్ నటుడు అమర్‌దీప్‌కు రూ. 2. 5 లక్షలు అందుకుంటున్నాడు.
ఏడో సీజన్‌లో తొలి కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చిన ప్రముఖ సీరియల్ నటి ప్రియాంక జైన్ బిగ్ బాస్ హౌస్‌లో రూ. 2.5 లక్షల పారితోషకం అందుకుంటుంది.
ఇక కార్తీక దీపం ఫేమ్ శోభాశెట్టి కూడా వారానికి రూ. 2.5 లక్షలు తీసుకుంటుందంట.
రెండో స్థానంలో సింగర్ దామినీ భట్ల నిలిచిందంట. ఆమె వారానికి రూ. 2లక్షల పారితోషకం తీసుకుంటుందంట.
హీరోయిన్ రతికా నిలిచింది. వారానికి రూ. 2 లక్షల రెమ్యూనరేషన్ అందుకుంటున్నట్లు వార్తలు తెలుస్తోంది.
అలాగే మరో నటి లాయర్ శుభశ్రీకి రూ. 2 లక్షలు తీసుకుంటుంది.
ఇక తక్కువ పారితోషకం తీసుకుంటున్న వారిలో నటుడు గౌతమ్ కృష్ణకు రూ. 1.75 లక్షలు తీసుకుంటుండగా, మోడల్ ప్రిన్స్ యావర్ రూ. 1.5 లక్షలు అందుకుంటున్నాడు. ప్రముఖ యూట్యూబర్, నటుడు టేస్టీ తేజా రూ.1.5 లక్షలు తీసుకుంటున్నాడు.
ప్రముఖ యూట్యూబర్, రైతు పల్లవిప్రశాంత్ వారానికి కేవలం రూ. 1 లక్ష తీసుకుంటున్నాడు.