బ్రహ్మాజీ ఇంట్లోకి భారీగా చేరిన వరద నీరు.. మోటర్‌ బోట్‌ కొనాలంటూ ట్వీట్!

Brahmaji Tweet : గత కొద్దిరోజులుగా కురుస్తున్న వర్షాలకి హైదరాబాదు నగరం అతలాకుతలం అయింది. కాస్త గ్యాప్‌ ఇచ్చినట్టే ఇస్తూ వాన దంచికొడుతుంది. దీంతో పలు ప్రాంతాలు జలదిగ్భంధంలో ఉన్నాయి.

Update: 2020-10-19 12:52 GMT

Brahmaji Tweet : గత కొద్దిరోజులుగా కురుస్తున్న వర్షాలకి హైదరాబాదు నగరం అతలాకుతలం అయింది. కాస్త గ్యాప్‌ ఇచ్చినట్టే ఇస్తూ వాన దంచికొడుతుంది. దీంతో పలు ప్రాంతాలు జలదిగ్భంధంలో ఉన్నాయి. నిన్న ఆదివారం కాస్తా బ్రేక్ ఇచ్చినప్పటికీ మళ్ళీ సోమవారం వర్షాలు భారీగానే పడుతున్నాయి. పడుతున్న వర్షాలకి రోడ్లు మాత్రమే కాదు ఇళ్ళ పరిస్థితి కూడా దారుణంగా తయారైంది. తాజాగా టాలీవుడ్ నటుడు బ్రహ్మాజీ తన ఇంటి పరిస్థితి ఇది అంటూ సోషల్ మీడియాలో ఫోటోలను పెట్టాడు. ఈ ఫోటోలను గమనించినట్టు అయితే ఆయన ఇంటి ఆవరణలో భారీగా వరద నీరు వచ్చి చేరింది. కాలనీ మొత్తం జలమయమైనట్లు కనిపిస్తోంది. అయితే ఈ ఫోటోలను ఉద్దేశిస్తూ బ్రహ్మాజీ మోటర్‌ బోట్‌ కొనాలనుకుంటున్నా.. ఏది బాగుంటుందో సలహా ఇవ్వండి అని ట్వీట్‌ చేశారు. దీనికి నెటిజన్లు తమదైన శైలిలో సమాధానాలు ఇస్తున్నారు.

ఇక ఇది ఇలా ఉంటే వరద భాదితుల కు తెలంగాణ సీఎం కేసీఆర్ అండ‌గా నిలిచారు. వ‌ర‌ద నీటి ప్ర‌భావానికి గురైన హైద‌రాబాద్ న‌గ‌రంలోని ప్ర‌తి ఇంటికి రూ. 10 వేల చొప్పున ఆర్థిక సాయం అందిస్తామ‌ని ప్ర‌క‌టించారు. అదే విధంగా నగరంలోని పేదప్రజలకు ఆర్థిక సాయం అందించేందుకు మున్సిప‌ల్ శాఖ‌కు ప్ర‌భుత్వం రూ. 550 కోట్లు త‌క్ష‌ణం విడుద‌ల చేస్తుంద‌ని సీఎం కేసీఆర్ తెలిపారు. వ‌ర్షాలు, వ‌ర‌ద‌ల వ‌ల్ల ఇల్లు పూర్తిగా కూలిపోయిన వారికి రూ. ల‌క్ష చొప్పున, పాక్షికంగా దెబ్బ‌తిన్న ఇండ్ల‌కు రూ. 50 వేల చొప్పున ఆర్థిక సాయం అందించ‌నున్న‌ట్లు కేసీఆర్ తెలిపారు. ఈ ఆర్థిక సాయం మంగ‌ళ‌వారం ఉద‌యం నుంచే ప్రారంభిస్తామ‌ని ఆయన వెల్ల‌డించారు. హైదరాబాద్ నగర పరిధిలోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజ్గిరి జిల్లాల కలెక్టర్లు, వారి బృందాలు వెంటనే రంగంలోకి దిగాలన్నారు కేసీఆర్.. 

Tags:    

Similar News