Taraka Ratna: తారకరత్న పార్థివదేహానికి సినీ, రాజకీయ ప్రముఖుల నివాళి

Taraka Ratna: తారకరత్న మరణంతో తెలుగు రాష్ట్రాల్లో విషాదం

Update: 2023-02-19 05:38 GMT

Taraka Ratna: తారకరత్న పార్థివదేహానికి సినీ, రాజకీయ ప్రముఖుల నివాళి

Taraka Ratna: రంగారెడ్డి జిల్లా మోకిలలోని తారకరత్న నివాసంలో ఆ‍యన పార్థివదేహానికి సినీ, రాజకీయ ప్రముఖులు నివాళులు అర్పిస్తున్నారు. సినీ హీరో జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్, నటుడు విజయ్, శివాజీరాజా తారక్ మృతదేహానికి నివాళులు అర్పించారు. రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి, తదితరులు నివాళులర్పించారు. తారక్ సతీమణి, కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యం చెప్పారు.

23 రోజులుగా బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుసిన తారకరత్న పార్థివదేహాన్ని రంగారెడ్డి జిల్లా మోకిలలోని ఆయన స్వగృహానికి తరలించారు. తారకరత్న అకాల మరణంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో విషాదకర వాతావరణం నెలకొంది. ఆయన మృతిపట్ల విచారం వ్యక్తం చేస్తూ పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం ప్రకటించారు. మృత్యువుతో 23 రోజుల పాటు పోరాడి తామందరికి తారక్ దూరమయ్యారని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ట్విటర్‌లో సంతాపం తెలిపారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్, మెగాస్టార్ చిరంజీవి, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్, వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు.

రేపు ఉదయం నుంచి సాయంత్రం వరకు తారకరత్న పార్థివ దేహాన్ని ప్రజలు, అభిమానుల సందర్శనార్థం జూబ్లీహిల్స్‌లోని ఫిలిం ఛాంబర్స్‌లో ఉంచనున్నారు. రేపు సాయంత్రం 5 గంటలకు జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో తారకరత్న అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

Tags:    

Similar News