ఓటీటీ లో "కాంతార" విషయంలో డిసప్పాయింట్ అవుతున్న అభిమానులు

* ప్రస్తుతం నడుస్తున్న వివాదాల వల్ల ఓటీటీ లో ఈ సినిమాలో ఆ పాటను తీసేశారు.

Update: 2022-11-24 09:04 GMT

ఓటీటీ లో "కాంతారా" విషయంలో డిసప్పాయింట్ అవుతున్న అభిమానులు

Kantara: కన్నడలో రిషబ్ శెట్టి హీరోగా స్వీయ దర్శకత్వంలో నటించిన సినిమా కాంతార బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచిన సంగతి తెలిసిందే. కన్నడలో మాత్రమే కాక ఈ సినిమా అన్ని భాషల్లోనూ బ్లాక్ బాస్టర్ గా నిలిచింది. నార్త్ బెల్ట్ లో కూడా "పుష్ప" కంటే భారీ సక్సెస్ ను అందుకుంది. ఇక ప్రేక్షకుల ఎదురు చూపులకు అంతం పలుకుతూ ఈ సినిమా ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ లో కూడా స్ట్రీమ్ అవుతుంది.

నిజానికి నవంబర్ మొదటి వారంలోనే ఓటీటీలలో విడుదల కావలసిన ఈ సినిమా ఇంకా థియేటర్లో అద్భుతమైన కలెక్షన్లతో నడుస్తూ ఉండడంతో దర్శకనిర్మాతలు ఓటీటీ రిలీజ్ ని కొంత వాయిదా వేశారు. ఎట్టకేలకు ఈ సినిమా నేడు అమెజాన్ ప్రైమ్ లో విడుదలైంది. కానీ ఓటీటీలలో సినిమా చూసిన వారు మాత్రం అంతగా సాటిస్ఫై అవ్వటం లేదని తెలుస్తోంది.

నిజానికి "కాంతార" సినిమాలో అన్నిటికంటే హైలైట్ క్లైమాక్స్ లో వచ్చే వరాహరూపం పాట. ఒక అదిరిపోయే యాక్షన్ సీక్వెన్స్ తర్వాత వచ్చే ఈ పాట ప్రేక్షకులకు మంచి హై ఇస్తుంది. కానీ ప్రస్తుతం నడుస్తున్న వివాదాల వల్ల ఓటీటీ లో ఈ సినిమాలో ఆ పాటను తీసేశారు. ఆ పాటకు బదులుగా వేరే పాటని పెట్టారు. దీంతో అభిమానులు చాలా డిసప్పాయింట్ అవుతున్నారు. టైక్కుడం బ్రిడ్జ్ వారు తమ "నవరసం" పాట కాపీ చేసి "వరాహరూపం" పాటని చేశారని కేసు పెట్టిన సంగతి తెలిసిందే. ఈ ప్లగరిజం కేసులో కోర్టు కూడా చిత్ర బృందం ఈ పాటను వాడకూడదని తీర్పునిచ్చింది. దీంతో చేసేది లేక సినిమా నుంచి సూపర్ హిట్ పాటను తీసేయాల్సి వచ్చింది.

Tags:    

Similar News