EVOL Movie OTT: సెన్సార్ బోర్డు ఇబ్బందులతో.. నేరుగా ఓటీటీలోకి మూవీ. స్ట్రీమింగ్ ఎందులో అంటే.. ?
EVOL Telugu Movie OTT: బోల్డ్ కంటెంట్‌తో వస్తున్న చిత్రాలు, సెన్సర్ బోర్డ్ అంగీకరించని చిత్రాలను ఓటీటీలో విడుదల చేయడం ఇటీవల ఒక ట్రెండ్‌లా నడుస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఇలాంటి ఓ సినిమానే నేరుగా ఓటీటీలో విడుదలకు సిద్ధమవుతోంది.
EVOL Telugu Movie OTT: కరోనా సమయంలో చాలా సినిమాలు నేరుగా ఓటీటీలో విడుదలైన విషయం తెలిసిందే. అయితే ఆ తర్వాత పరిస్థితులు మెరుగయ్యాయి. మళ్లీ సినిమాలు నేరుగా థియేటర్లలో విడుదలవుతూ వచ్చాయి. అయితే ఇప్పుడు కూడా కొన్ని సినిమాలు ఇప్పటికీ డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అవుతున్నాయి. ముఖ్యంగా కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే సినిమాలను నేరుగా ఓటీటీ వేదికగా విడుదల చేస్తున్నారు మేకర్స్.
బోల్డ్ కంటెంట్‌తో వస్తున్న చిత్రాలు, సెన్సర్ బోర్డ్ అంగీకరించని చిత్రాలను ఓటీటీలో విడుదల చేయడం ఇటీవల ఒక ట్రెండ్‌లా నడుస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఇలాంటి ఓ సినిమానే నేరుగా ఓటీటీలో విడుదలకు సిద్ధమవుతోంది. ఇంతకీ ఏంటా మూవీ.? ఈ సినిమా ఎందులో స్ట్రీమింగ్ కానుంది.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. బోల్డ్ కంటెంట్‌తో తెరకెక్కిన 'ఎవోల్' మూవీని ఓటీటీలో విడుదల కానుంది.
ఇంగ్లిష్‌లో LOVE పదాన్ని తిరగేసి రాస్తే వచ్చే 'EVOL' ఇదే ఈ సినిమా టైటిల్. సెన్సార్ చిక్కుల్లో ఎదుర్కొన్న సినిమాను ఇప్పుడు నేరుగా ఓటీటీ వేదికగా విడుదల చేసేందుకు మేకర్స్ సిద్ధమయ్యారు. ఈ సినిమా ఆహా వేదికగా స్ట్రీమింగ్ కానుంది. ఆగస్టు 15వ తేదీ నుంచి ఈ సనిమా స్ట్రీమింగ్ మొదలు కానుంది. బోల్డ్ సీన్స్ ఎక్కువగా ఉండటంతో సెన్సార్ బోర్డు బ్యాన్ చేసిందని సమాచారం. అందుకే ఈ చిత్రాన్ని నేరుగా ఓటీటీలో విడుదల చేశారు. దాదాపు అందరూ కొత్త ఆర్టిస్టులతో తెరకెక్కిన ఈ సినిమా ఓటీటీలో ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.