Drishyam 3: 'దృశ్యం' కథకు ముగింపు.. పార్ట్3తో ఎండ్ కార్డ్ పడనుందా.?
Drishyam 3: దృశ్యం3 మూవీ ఉంటుందని ఇప్పటికే చిత్ర యూనిట్ ప్రకటించిన విషయం తెలిసిందే.
Drishyam 3: జీతు జోసెఫ్ దర్శకత్వంలో వచ్చిన దృశ్యం సినిమా ఎంతటి విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సని పనిలేదు. సస్పెన్స్ థ్రిల్లర్‌తో తెరకెక్కిన ఈ సినిమా మలయాళ ప్రేక్షకులను పెద్దె త్తున ఆకట్టుకుంది. అలాగే మలయాళంలో బ్లాక్ బస్టర్ అయ్యాక ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు తమిళం, కన్నడ, బెంగాలీ ఇలా అన్ని భాషల్లో రీమేక్ అయి భారీ విజయాన్ని నమోదు చేసుకుంది.
భాషతో సంబంధం ప్రతీ ఒక్కరూ ఈ సినిమాకు బ్రహ్మరథం పట్టారు. కేవలం భారతీయ భాషలకు మాత్రమే పరిమితం కాకుండా చైనీస్, సింహళీస్ లాంటి విదేశీ భాషల్లో కూడా ఈ సినిమా రీమేక్ అయి అక్కడ కూడా మంచి విజయాన్ని అందుకుంది. ఇక దృశ్యం చిత్రానికి సీక్వెల్‌గా వచ్చిన దృశ్యం2 కూడా మంచి విజయాన్ని నమోదు చేసుకుంది. ఈ సినిమా కూడా అన్ని భాషల్లో విడుదలైంది.
అనుకోకుండా ఒక మర్డర్ కేసులో ఇరుక్కున్న తన కుటుంబాన్ని హీరో ఎలా కాపాడుకున్నారన్న అంశాలను ఎంతో ఆసక్తికరంగా చూపించారు. ముగిసిందనకున్న మర్డర్ కేసును రీ ఓపెన్ చేసి మళ్లీ తనను, తన కుటుంబాన్ని ఇరుకున్న పెట్టాలని చూసిన పోలీసులకు తన మాస్టర్ ప్లాన్‌తో హీరో ఎలా బోల్తా కొట్టించాడో దృశ్యం2లో చూపించారు. అయితే దృశ్యం చిత్రానికి మరో సీక్వెల్ వస్తున్న విషయం తెలిసిందే.
దృశ్యం3 మూవీ ఉంటుందని ఇప్పటికే చిత్ర యూనిట్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే అందుకు ప్రాజెక్టును పట్టాలెక్కించేందుకు సిద్ధమవుతున్నారు మేకర్స్? ప్రస్తుతం మోహన్‌లాల్, జీతు జోసెఫ్ వేర్వేరు ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. అవి పూర్తికాగానే దృశ్యం3 చిత్రాన్ని మొదలు పెట్టనున్నారు. వచ్చే ఏడాది డిసెంబర్ నాటికి ఈ సినిమాను విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తంది. అయితే దృశ్యం కథ.. మూడో పార్ట్‌తో ముగియనుందని తెలుస్తోంది. ఇంకో పార్ట్ అయితే.. సాగతీతగా అనిపిస్తుందన్న కారణంగా చిత్ర యూనిట్ మూడో పార్ట్‌తో సినిమాను ముగించేయాలని ఫిక్స్ అయ్యారని సమాచారం. మరి ఈ చిత్రానికి ముగింపు ఎలా ఉంటుందో చూడాలి.