Bigg Boss 7 Telugu: బిగ్‌బాస్ 7లో కొత్త ప్రేమ జంట.. డాక్టర్ బాబు, లాయర్ పాప మధ్య సంథింగ్ స్పెషల్.. హగ్గులతో రచ్చ..!

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ హౌస్‌లో కొత్త ప్రేమ జంట సందడి చేస్తోంది. హౌస్‌మేట్స్ మధ్య ఇవన్నీ కామనే అని అంటుంటారు.

Update: 2023-10-04 05:22 GMT

Bigg Boss 7 Telugu: బిగ్‌బాస్ 7లో కొత్త ప్రేమ జంట.. డాక్టర్ బాబు, లాయర్ పాప మధ్య సంథింగ్ స్పెషల్.. హగ్గులతో రచ్చ..!

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ హౌస్‌లో కొత్త ప్రేమ జంట సందడి చేస్తోంది. హౌస్‌మేట్స్ మధ్య ఇవన్నీ కామనే అని అంటుంటారు. గత సీజన్‌లోనూ ఇలాంటివి కనిపించాయి. బయటకు వచ్చిన తర్వాత కూడా వీరి ప్రేమ కంటిన్యూ అవుతూనే ఉంది. ఇలాంటి వార్తలు మన చూస్తూనే ఉన్నాం. తాజా సీజన్ బిగ్ బాస్ 7లోనూ ఓ లవ్ ట్రాక్ షురువైంది. రైతు బిడ్డగా బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన పల్లవి ప్రశాంత్ , రతిక లవ్ జోడీగా పేరుగాంచారు. అయితే, ఆ తర్వాత వీరిద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయి. దీంతో వీరిద్దరూ విడిపోయారు. కాగా, రతిక రైతు బిడ్డను బాగానే తన వెంట తిప్పుకుని, ఆ తర్వాత వద్దంటూ పక్కన పెట్టేసిందని ఆడియోన్స్ కూడా అనుకున్నారు. ఇక ఇప్పుడు హౌస్ లో మరో లవ్ స్టోరీ సందడి చేస్తోంది. డాక్టర్ బాబు గౌతమ్, లాయర్ పాప శుభ శ్రీ మధ్య ప్రేమాయణం మొదలైంది.

గత కొన్ని రోజులుగా వీరిద్దరి మధ్య క్లోజ్‌నెస్ బాగా పెరిగిపోయింది. హౌస్‌లో ఎక్కడ చూసినా.. వీరిద్దరు జంటగా కనిపిస్తున్నారు. ఇక బిగ్ బాస్ కెమెరాలు కూడా ఈ జోడీపై ఫోకస్ చేస్తున్నాయి. తొలి వారం నుంచే వీరిమధ్య మాటలు కలిశాయి. కాగా, వీరు మైక్ తీసేసి గుసగుసలు చెప్పుకోవడం కనిపించింది.

కాగా, నిన్నటి ఎపిసోడ్‌లోనూ గౌతమ్, శుభ శ్రీ మధ్య జరిగిన సీన్స్ ఆడియెన్స్‌ను కట్టిపడేశాయి. నేను మాట్లాడితే నీకు నచ్చడం లేదా ఏంటి, మెంటల్‌లా కనిపిస్తున్నానా ఏంటి అంటూ గౌతమ్‌ని శుభ శ్రీ అడుగుతుంది. దానికి డాక్టర్ బాబు నచ్చుతుంది, అందుకే కదా నిన్ను భరిస్తున్నాను అంటూ సమాధానమిస్తాడు. ఈ మాటలకు శుభ శ్రీ సిగ్గుపడుతూ కనిపిస్తుది. ఇలా మాటల మధ్య గౌతమ్ లాయర్ పాపకు ఓ హగ్ ఇస్తాడు. అలాగే ఓ టాస్క్‌లోరే వీరిద్దరూ జోడీగా కనిపిస్తారు. మొత్తానికి బిగ్ బాస్ 7లో మరో లవ్ ట్రాక్ మొదలైందన్నమాట.

Tags:    

Similar News