Actress: 'ఆరుగురు పతివ్రతలు' హీరోయిన్ గుర్తుందా.. ఇప్పుడీ బ్యూటీ ఏం చేస్తోంది.?
'ఆరుగురు పతివ్రతలు' ఈ సినిమా గురించి ప్రత్యేకంగా పరియం చేయాల్సిన పనిలేదు. ఇప్పటి వారికి ఈ సినిమా తెలియకపోయినప్పటికీ.. 20 ఏళ్ల క్రితం మాత్రం పెద్ద సెన్షేషన్. 2004లో వచ్చిన ఈ సినిమా అప్పట్లో ఇండస్ట్రీని షేక్ చేసింది. కామెడీ జోనర్లో మూవీస్‌ను తెరకెక్కించే ఈవీవీ సత్యనారాయణ ఈ సినిమాను బోల్డ్ కంటెంట్‌తో తీసుకొచ్చారు.
ఓ ఆరుగురు మహిళల జీవితాల్లో జరిగిన సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ ఆరుగురిలో అమృత పాత్ర చాలా హైలెట్ అయ్యిందని చెప్పాలి. పెళ్లి చేసుకున్న ఓ మహిళ కొన్ని అనివార్య కారణాల వల్ల మరో పురుషుడుతో వివాహేతర సంబంధం పెట్టుకుంటుంది. ఆ తర్వాత ఆమె జీవితంలో ఎలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయన్నదే ఈ పాత్ర కథనం. ఈ పాత్రలో అమృత అద్బుత నటనను కనబరించింది. ఇటు భర్త, అటు లవర్ మధ్య నలిగిపోయిన మహిళ పాత్రలో నటించింది .
ఈ సినిమాతో అమృత పేరు సినిమా ఇండస్ట్రీలో ఒక్కసారిగా మారుమోగిపోయింది. ఈ సినిమాతో ఆమెకు వరుసగా అవకాశాలు వస్తాయని అంతా భావించారు. అయితే ఏమైందో ఏమో కానీ అమృత మరో తెలుగు సినిమాలో నటించలేదు. నిజానికి అమృత కన్నడ హీరోయిన్. అక్కడ కొన్ని సినిమాల్లో నటించిన తర్వాత తెలుగులో ఈ అవకాశం వచ్చింది. అయితే ఆరుగురు పతివ్రతల తర్వాత ఆమె తెలుగులో నటించకపోవడానికి పలు కారణాలు అప్పట్లో గుసగుసలు వినిపించాయి.
వీటిలో ప్రధానమైంది అమృతకు ఈ సినిమా తర్వాత మళ్లీ అలాంటి బోల్డ్ పాత్రలే ఆఫర్ చేశారంటా. దీంతో అలాంటి పాత్రలో మరోసారి నటించడం ఇష్టం లేని ఆమె తెలుగు సినిమాలో నటించలేదని వార్తలు వచ్చాయి. అలాగే అమృత క్రేజ్‌ను చూసి కావాలనే కొందరు ఆమెను ఇండస్ట్రీకి దూరం చేశారనే గాసిప్స్ కూడా వచ్చాయి. ఇక అమృత ఆ తర్వాత కొన్ని కన్నడ మూవీస్‌లో నటించారు.
ఆ తర్వాత ఓ ఎన్ఆర్ఐని పెళ్లి చేసుకొని అమెరికాకు వెళ్లారు. అయితే కొన్నేళ్ల తర్వాత కొన్ని కారణాలతో అమెరికా నుంచి ఇండియాకు తిరిగొచ్చిన అమృత.. ప్రస్తుతం బెంగళూరులో తన కుటుంబంతో ఉంటున్నారని సమాచారం. కాగా అమృత ప్రస్తుతం సినిమాలకు పూర్తిగా దూరంగా ఉంటోందని తెలుస్తోంది. అయితే ఇప్పటీకీ సోషల్ మీడియాలో ఈ సినిమాకు సంబంధించి మీమ్స్ వైరల్ అవుతూనే ఉన్నాయి.