వర్మ ఆఫీసును ముట్టడించిన దిశా కుటుంబ సభ్యులు!
Ram Gopal Varma Office : తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా యావత్ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది దిశా సంఘటన.. అయితే ఈ ఘటనను ఆధారంగా చేసుకొని టాలీవుడ్ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 'దిశా ఎన్ కౌంటర్' అనే పేరుతో ఓ సినిమాని తెరకెక్కిస్తున్నాడు.
Ram Gopal Varma Office : తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా యావత్ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది దిశా సంఘటన.. అయితే ఈ ఘటనను ఆధారంగా చేసుకొని టాలీవుడ్ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 'దిశా ఎన్ కౌంటర్' అనే పేరుతో ఓ సినిమాని తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ , ట్రైలర్ ని కూడా రిలీజ్ చేశాడు వర్మ. అయితే ఈ సినిమాని వెంటనే నిషేధించాలని కోరుతూ దిశా తండ్రి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపైన స్పందించిన కోర్టు సెన్సార్ బోర్డుకు ఫిర్యాదు చేయాలని సూచించింది. ఫిర్యాదును వీలైనంత త్వరగా పరిష్కరించాలని సెన్సార్ బోర్డుకు ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ఈ క్రమంలో దీనిపైన వర్మ ఓ ట్వీట్ చేశాడు.
ఇది నిర్భయ కేసు నుంచి జరిగిన అనేక ఘటనల ఆధారంగా తీస్తున్న ఫిక్షనల్ స్టోరీ అని, దిశ ఎన్‌కౌంటర్ సినిమాపై అనేక ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో స్పష్టత ఇస్తున్నట్టుగా వర్మ ట్వీట్ చేశాడు! ఈ క్రమంలో హైదరాబాదులోని వర్మ ఆఫీస్ ఆఫీస్ వద్ద దిశా కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా దిశా తండ్రి మాట్లాడుతూ.. ఈ సినిమాని తెలంగాణ ప్రభుత్వం నిషేధించాలని అన్నారు.
అంతేకాకుండా యూట్యూబ్‌లో ఉన్న ట్రైలర్‌ను వెంటనే తొలగించాలని అయన కోరారు. తమ కుటుంబం అనేక సమస్యలతో బాధపడుతుంటే ఇంకా సినిమా తీసి తమను మరింత కుంగదీయొద్దని అయన ఆవేదనని వ్యక్తం చేశారు. ఆడపిల్లలు ఉన్న ప్రతి ఒక్కరు వర్మను సమాజం నుంచి వెలివేయాలని అయన మీడియాతో అన్నారు.. ఈ విషయంలో తాము సుప్రీంకోర్టుకి కూడా వెళ్తామని దిశా తండ్రి వెల్లడించారు.
ఇక ఈ సినిమాని నవంబర్ 26, 2020 న రిలీజ్ చేస్తున్నట్టుగా ఇప్పటికే ప్రకటించాడు వర్మ..ఈ సినిమాను నట్టి కరుణ సమర్పణలో అనురాగ్ కంచర్ల ప్రొడక్షన్‌పై నిర్మిస్తున్నారు. ఆనంద్ చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. అటు ఈ కేసులో ప్రధాన నిందితులు అయిన నలుగురిని హైదరాబాదు పోలీసులు ఎన్ కౌంటర్ చేసి చంపేసిన సంగతి తెలిసిందే.. దీనిపట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.