Disha Encounter : 'దిశా ఎన్ కౌంటర్' ట్రైలర్ వచ్చేసింది !
Disha Encounter : దిశా ఘటన రెండు తెలుగు రాష్ట్రాలలో కాకుండా యావత్ దేశంలోనే సంచలనం సృష్టించింది. నవంబర్ 26, 2019న షాద్ నగర్ సమీపంలో జరిగిన సాముహిక అత్యాచారాన్ని ఆధారంగా చేసుకొని వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 'దిశా ఎన్ కౌంటర్' అనే పేరుతో ఓ సినిమాని తెరకెక్కిస్తున్నాడు.
Disha Encounter : దిశా ఘటన రెండు తెలుగు రాష్ట్రాలలో కాకుండా యావత్ దేశంలోనే సంచలనం సృష్టించింది. నవంబర్ 26, 2019న షాద్ నగర్ సమీపంలో జరిగిన సాముహిక అత్యాచారాన్ని ఆధారంగా చేసుకొని వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 'దిశా ఎన్ కౌంటర్' అనే పేరుతో ఓ సినిమాని తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ ని విడుదల చేసిన వర్మ తాజాగా ఈరోజు సినిమా ట్రైలర్ ని రిలీజ్ చేశాడు.
సినిమా ట్రైలర్ లో దిశా ఘటనను లైవ్ లో చూసినట్లుగా చిత్రీకరించాడు వర్మ.. ఓ అమ్మాయి బైక్ ని పార్క్ చేయడం.. అక్కడ ఓ నలుగురు యువకులు ఆ అమ్మాయిని చూడడం.. ఆ తర్వాత బైక్ ని పంచర్ చేయడం, ఆ అమ్మాయిని నమ్మించి ఎత్తుకెళ్ళి హత్యాచారం చేయడం.. ఆ తరవాత లారీలో తీసుకెళ్ళి ఒక దగ్గర పెట్రోల్ పోసి చంపేయడం, వారిని పోలీసులు ఎన్ కౌంటర్ లో చంపేయడం లాంటి సన్నివేశాలను అచ్చుగుద్దినట్టుగా చూపించాడు వర్మ.. ఇక ఈ సినిమాని నవంబర్ 26, 2020 న రిలీజ్ చేస్తున్నట్టుగా ఇప్పటికే ప్రకటించాడు వర్మ.. ట్రైలర్ తోనే సినిమా పైన ఆసక్తిని పెంచాడు వర్మ.. ఈ సినిమాను నట్టి కరుణ సమర్పణలో అనురాగ్ కంచర్ల ప్రొడక్షన్‌పై నిర్మిస్తున్నారు. ఆనంద్ చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు.
ఇక కేసులో ప్రధాన నిందితులు అయిన నలుగురిని హైదరాబాదు పోలీసులు ఎన్ కౌంటర్ చేసి చంపేసిన సంగతి తెలిసిందే.. దీనిపట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.