దిశా నిందితుల కుటుంబసభ్యులు మరోసారి సుప్రీంకోర్టుకు సంబంధించిన జ్యూడీషియల్ కమిషన్‌ను ఆశ్రయించారు. దర్శకుడు రాంగోపాల్ వర్మ నిర్మిస్తున్న దిశా ఎన్‌కౌంటర్ చిత్రాన్ని నిలిపి వేయాలని జ్యూడిషియల్ కమిషన్‌ను కోరారు. ఇంతకు ముందు కూడా దిశా తండ్రి శ్రీధర్ రెడ్డి సైతం ఈ చిత్రాన్ని ఆపాలని హైకోర్టును ఆశ్రయించారు. ఈ మూవీలో తమ వాళ్లను రౌడీలుగా చిత్రీకరిస్తున్నారని నిందితుల కుటుంబసభ్యులు ఆరోపించారు. ఈ మేరకు పోలీసులచే ఎన్‌కౌంటర్‌కు గురైన జోళ్లు శివ, జోళ్ళు నవీన్, చెన్నకేశవులు, హైమ్మద్ ఆరీఫ్ కుటుంబ సభ్యులు సోమవారం హైకోర్టుకు చేరుకున్నారు. ఈ చిత్రం చిన్నపిల్లలపై కూడా ప్రభావం చూపుతుందని ఈ మూవీని నిలిపివేయాలని కమిషన్‌ను నిందితుల కుటుంబసభ్యులు కోరారు. ఒక పక్క ఎంక్వయిరీ కొనసాగుతుంటే దిశ కథను ఎలా తెరకెక్కిస్తారని ఫిర్యాదులో ప్రశ్నించారు. రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని వెంటనే నిలిపి వెయ్యాలని కమిషన్‌ను కోరారు. నిందితుల తరుఫున న్యాయవాదుల సమక్షంలో కమిషన్‌కు ఫిర్యాదు చేశారు.