ఇక నెక్ట్స్‌ 'ఢిల్లీ ఫైల్స్‌'... సంచలన ప్రకటన చేసిన వివేక్ అగ్నిహోత్రి..

The Delhi Files: ద కశ్మీర్ ఫైల్స్ సినిమాతో సంచలనం సృష్టించిన వివేక్ అగ్నిహోత్రి

Update: 2022-04-16 13:45 GMT

ఇక నెక్ట్స్‌ 'ఢిల్లీ ఫైల్స్‌'... సంచలన ప్రకటన చేసిన వివేక్ అగ్నిహోత్రి..

The Delhi Files: ద కశ్మీర్ ఫైల్స్ సినిమాతో సంచలనం సృష్టించిన వివేక్ అగ్నిహోత్రి తాజాగా ఢిల్లీ ఫైల్స్ సినిమా తీస్తానని ప్రకటించిన కొన్ని గంటల్లోనే దానిమీద స్పెక్యులేషన్స్ ఊపందుకుంటున్నాయి. బీజేపీ నేతలు, హిందూ కుటుంబాల బాధితులు ఆ సినిమాను స్వాగతించగా సంఘ పరివార్ నేతలు రాజకీయం చేస్తున్నారన్న విమర్శలు వినిపించాయి. తాజాగా ఢిల్లీ ఫైల్స్ ను కూడా బీజేపీ నేతలు స్వాగతిస్తున్నారు.

1984లో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ హత్య దరిమిలా సిక్కుల ఊచకోత జరిగింది. 3 వేల మందికి పైగా సిక్కులను కాంగ్రెస్ నేతలు చంపేశారు. ఫలితంగా అనేక కుటుంబాలు దిక్కులేని స్థితిలోకి వెళ్లిపోయాయి. అలాగే 2020లో ఎన్నార్సీ, సీఏఏ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో తీవ్రమైన అల్లర్లు జరిగాయి. ఆ ఘటనలు కలుపుకొని ఢిల్లీ పైల్స్ సినిమాకు వివేక్ అగ్నిహోత్రి ప్లాన్ చేస్తున్నారు. అయితే గోద్రా పైల్స్ కూడా తీయాలని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. 

Tags:    

Similar News