Oxygen Plant: ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటు చేస్తోన్న డైరెక్టర్ సుకుమార్

Oxygen Plant: డైరెక్టర్ తన సొంత జిల్లాలో 25 లక్షలతో అందరికీ ఆక్సిజన్ అందించేలా ఈ ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నాడు.

Update: 2021-05-21 07:04 GMT

ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటు చేస్తోన్న డైరెక్టర్ సుకుమార్

Oxygen Plant: కరోనాతో చాలామంది చనిపోతున్నారు. టీఎన్ఆర్ లాంటి సినీ జర్నలిస్టు చనిపోవడంతో.. సినీజనం షాకయ్యారు. టాలీవుడ్ నటులకు వచ్చినా.. వారంతా కోలుకున్నారు. వారందరికీ బాగా దగ్గరై ఉండి చనిపోయినవారిలో టీఎన్ఆర్ ఒకరు. దీంతో వారంతా ఇప్పుడు కరోనా బాధితులకు సేవల చేయాలని కదులుతున్నారు. కరోనా బాధితుల్లో ఎక్కువమంది ఆక్సిజన్ అందక చనిపోయినవాళ్లే ఎక్కువ. ఆక్సిజన్ అంది ఉంటే వారంతా బతికి ఉండేవారే. అందుకే టాలీవుడ్ ప్రముఖులంతా ఆక్సిజన్ అందిస్తే ప్రాణాలు అందించినట్లే అని భావించి.. ఆ ప్రయత్నాలు మొదలెట్టారు.

ఈ నేపధ్యంలో ప్రముఖ దర్శకుడు సుకుమార్ తన సొంత జిల్లా తూర్పుగోదావరిలో ఆక్సిజన్ ప్లాంట్ పెడితే ఎలా ఉంటుందనేదానిపై చర్చలు మొదలెట్టడమే కాదు.. కార్యాచరణ కూడా మొదలెట్టినట్లు తెలుస్తోంది. 25 లక్షలతో అందరికీ ఆక్సిజన్ అందించేలా ఈ ప్లాంట్ను ఏర్పాటును చేయదలచారు. అందులో భాగంగా ఇటీవల జిల్లా అధికారులతో సంప్రదింపులు జరిపారు.

ఇక మొదటి విడతగా 40 లీటర్ల ఆక్సిజన్ సిలండర్లను అమలాపురంలో ఉన్న ఆజాద్ ఫౌండేషన్ కు తన స్నేహితుడు రాంబాబు ద్వారా సుకుమార్‌ ఇప్పించారు. ఈ సందర్భంగా సుకుమార్‌ మిత్రుడు రాంబాబు మాట్లాడుతూ.. త్వరలోనే కోనసీమలో ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు సుకుమార్‌ ప్రయత్నాలు ప్రారంభించారని తెలిపారు. ఇప్పుడే కాదు కరోనా మొదటి వేవ్‌లోనూ తన గ్రామంలోని ఇంటింటికి 1000 రూపాయలను పంపిణీ చేసి అందరిని ఆదుకున్నారు సుకుమార్‌.

Tags:    

Similar News