కరోనా వైరస్ ఎవ్వరినీ వదలట్లేదు. సామాన్యుల నుంచి ప్రముఖుల వరకు అందరూ కరోనా బారిన పడుతున్నారు. ఇప్పటికే పలువురు రాజకీయ, సినీ ప్రముఖులకు కరోనా సోకగా.. తాజాగా ప్రముఖ సీనియర్ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు కరోనా బారినపడ్డారు. ఈ విషయాన్ని ఫేస్ బుక్ వీడియో ద్వారా స్వయంగా వెల్లడించారు సింగీతం. సెప్టెంబర్ 9న కోవిడ్ పాజిటివ్ వచ్చినట్టు వెల్లడించిన ఆయన, ఈ నెల 22న హోమ్ ఐసొలేషన్ పూర్తవుతుందని వెల్లడించారు.
లక్షణాలు కొద్దిగా ఉండడంతో ఇటీవల కరోనా పరీక్షలు చేయించుకున్నానని, తనకి పాజిటీవ్ అని తేలిందని చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నేను ఇప్పుడేంటి.. గత అరవై, డభై ఏళ్లుగా పాజిటీవ్‌నే అంటూ కరోనాని సైతం లైట్ తీసుకున్నారు దర్శకుడు. పరీక్షల్లో పాజిటీవ్ అని తేలడంతో ఆయన ప్రస్తుతం హోం ఐసొలేషన్‌లో ఉన్నానని పేర్కోన్నాడు. ఈ హోమ్ ఐసోలేషన్ ఈనెల 23 వరకూ ఉండనుందని చెప్పారు. ఈ సందర్భంగా తన అభిమానులు, సన్నిహితులు, స్నేహితులు కంగారు పడొద్దంటూ తన ఆరోగ్యం పూర్తిగా అదుపులోనే ఉందని, త్వరలోనే పూర్తిగా కోలుకుంటానని అన్నారు.