RGV Tested Covid-19 Positive : మర్డర్' కేసు విచారణకు డుమ్మా కొట్టిన వర్మ!
RGV Tested Covid-19 Positive : వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మకి తాజాగా కరోనా సోకిందని ఓ న్యూస్ వైరల్ అయిన సంగతి తెలిసిందే..
RGV Tested Covid-19 Positive : వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మకి తాజాగా కరోనా సోకిందని ఓ న్యూస్ వైరల్ అయిన సంగతి తెలిసిందే.. అయన తీవ్ర జ్వరంతో బాధపడుతున్నారని అయనతో కాంటాక్ట్ లో ఉన్నవారందరూ కరోనా పరీక్షలు చేయించుకోవాలని సూచించినట్టుగా వార్తలు వెలువడ్డాయి.. అయితే దీనిపైన వర్మ తన ట్విట్టర్ వేదికగా స్పందించాడు...
నాకు తీవ్ర జ్వరం వచ్చిందని, నేను కరోనాతో బాధపడుతున్నట్టుగా ప్రచారం జరుగుతుంది.. నేను ఆరోగ్యంగా ఉన్నాను. వరుస సినిమాలు చేస్తున్నాను కూడా . సీరియస్‌గా వర్కవుట్స్ కూడా చేస్తున్నా. ఫ్రెండ్స్ మిమ్మల్ని నిరాశపరుస్తున్నందుకు క్షమించండి..ఈ వార్త అబద్ధం అయినందుకు వాళ్ళు చాలా బాధపడి ఉంటారని, భవిష్యత్తులో వాళ్ళ కోరిక నెరవేరాలని ఆశిస్తున్నాను అని వర్మ పేర్కొన్నాడు.
ఇక ఇది ఇలా ఉంటే వర్మకు నిజంగానే కరోనా వైరస్ సోకిందని ఆయన లాయర్ నల్గొండ జిల్లా ఎస్సీ, ఎస్టీ కోర్టుకు విన్నవించారు. కరోనా సోకిన కారణంగా తన క్లయింట్ విచారణకు హాజరుకాలేకపోయారని వెల్లడించారు.. తాజాగా వర్మ మర్డర్ అనే సినిమాని చేస్తున్న సంగతి తెలిసిందే.. అయితే తన అనుమతి లేకుండా సినిమా చేస్తుండడంతో ప్రణయ్ భార్య అమృత నల్గొండ జిల్లా ఎస్సీ, ఎస్టీ కోర్టులో పిటిషన్ వేసింది.
అయితే ఈనెల 11 లోగా సినీ నిర్మాతలు కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. సినీ నిర్మాతలు కానీ దర్శకుడు వర్మ కానీ ఎలాంటి కౌంటర్ దాఖలు చేయలేదు. దీనితో న్యాయవాదిని కోర్టు ప్రశ్నించగా తన క్లయింట్‌కు కరోనా సోకిందని, అందువల్ల పిటిషన్‌కు జవాబు ఇవ్వలేకపోతున్నామని వెల్లడించాడు.. దీనితో దీంతో అమృత వేసిన పిటిషన్ విచారణను ఈ నెల 14కి వాయిదా వేసింది కోర్టు.